ఇంటర్ పీ ఎస్ టీ టీ లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 17 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట స్ధానిక సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ బాలికల కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము – ఒకేషనల్ ప్రైమరీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ గ్రూప్ నందు ప్రవేశాలకు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని గురుకుల పాఠశాల / కళాశాల ప్రిన్సిపాల్ లలిత కుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కోర్స్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందని, మొత్తం 15 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. రిజర్వేషన్ వారీగాఎస్సీ 7; బి సి 3; ఎస్ టి 2; మైనారిటీ 1; ఓసి 1; కన్వర్టెడ్ క్రిస్టియన్ 1 చొప్పున ఖాళీలున్నాయని , 2023 మార్చి లో పదవ తరగతి పాస్ అయి,ఆసక్తి, అర్హత కలిగినటువంటి విద్యార్థినులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ నెల19 న సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ఆఫీసు పనివేళలలో సంప్రదించాలన్నారు.అడ్మిషన్ల కొరకు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో రావాల్సి ఉంటుందని,ఖాళీల మేరకు, మొదట వచ్చిన వారికి మొదటగా అవకాశం కల్పించబడుతుందని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking