ఉపాధ్యాయ పాత్ర ను పోషించిన జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. గురువారం సొన్ మండలం లోని సోషల్ వెల్ఫేర్ పాఠశాల,జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించి 10 వ తరగతి విద్యార్థులకు గణితం బోధించారు. బోర్డు పై లెక్కలు చేస్తూ గణితం లో రాణించేందుకు చిట్కాలు అందించారు.విషయ పరిజ్ఞానం పై ఎంత వరకు పట్టు ఉంది అని విద్యార్థులను ప్రశ్నించి తెలుసుకున్నారు. కలెక్టర్ స్వయం గా ఉపాధ్యాయ పాత్ర పోషించి గణితం లో వర్గ సమాసాల గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు ఆటలు, వ్యాస రచన తదితర అంశాలపై పట్టు కలిగి ఉండాలని అన్నారు. పాఠశాల గోడలపై విద్యార్థులు వేసిన పెయింటింగ్స్ నీ పరిశీలించి అభినందించారు.అదే విధంగా ఇంటర్మీడియేట్ విద్యార్థులతో విషయ పరిజ్ఞానం పై సంభాషించారు.
తరగతి గదిని శుభ్రంగా ఉంచుకోవాలని మిగితా విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలని అన్నారు.
తదనంతరం విద్యార్థుల మధ్యాహ్న భోజనం, వారికి మెను ప్రకారం భోజనం పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్ పరిశీలించి దానికి అనుగుణంగా గా సరుకులు, కూరగాయలు ఉన్నాయో లేవో పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది తో మాట్లాడుతూ పరిసరాలు, వంటశాల పరిశుభ్రంగా ఉంచాలని, మెను ప్రకారం భోజనం అందించాలని, డెంగ్యు వ్యాధి ప్రభలుతున్న దృష్ట్యా మురికి నీరు నిలువ ఉండకుండా పరిసరాలు పరిశుభ్రం గా ఉంచాలని సూచించారు. తదనంతరం పాఠశాల ఆవరణ లో మొక్క నాటి, పాఠశాల మొత్తం కలియ తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
అంతకుముందు గాంధీ నగర్ పర్యటించి విష జ్వరాలు ప్రభలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇళ్ళు, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రజలను కోరారు.
అయిల్ ఫామ్ తోటను పరిశీలించి కోతుల బెడదా లేకుండా చూసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్, ఎమ్మార్వో , శివ రాజ్, జిడ్పిటిసి జీవన్ రెడ్డి, ఎంపీడీఓ,మోహన్ రెడ్డి, ఎంపీవో, పంచాయతీ సెక్రెటరీ, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking