బొల్లంపల్లి బబుల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎఫ్. డి. సి చైర్మన్ ప్రతాపరెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ పార్టీ కంచుకోటగా మారిన యావపూర్ గ్రామం.

 

మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గత తొమ్మిది సంవత్సరాల కాలంలో చేస్తున్న అభివృద్ధి పనులను చూసి వాటికి ఆకర్షితులై మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొల్లంపల్లి బబుల్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు గురువారం రోజున ఎఫ్డిసి చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి స్వగృహంలో తూప్రాన్ మండలంలోని యావాపూర్ గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు సుమారు 50 మంది వరకు తూప్రాన్ మండల పార్టీ అధ్యక్షుడు బాబుల్ రెడ్డి , గ్రామసర్పంచ్ శేరి నరసింహారెడ్డి శంకర్ రెడ్డి గార్ల సమక్షంలో చేరినారు. అనంతరం బాబుల్ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు బాగున్నాయని నిరుపేద రైతుల పట్ల కెసిఆర్ కు ఉన్న చిత్తశుద్ధి చూసి సంతోషం కలిగిందని కొనియాడారు. పార్టీ కోసం కష్టపడి అతిపెద్ద మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ అభివృద్ధి కార్యక్రమాలపై కితాబిచ్చారు.
బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న నాయకులు మాజీ ఎంపీటీసీ ఎంజాల స్వామి, ఉప సర్పంచ్ యంజాల లక్ష్మి, వార్డు సభ్యులు పోడేటి రాజు, సాకలి భూములు, పట్లూరి సురేందర్ రెడ్డి, పిట్ల సింహం, కుమ్మరసింహం, చెర్లపల్లి రామస్వామి, చెట్లపల్లి వెంకటేష్, చెట్లపల్లి సత్యనారాయణ, గంట రాజశేఖర్, మేకల శ్రీకాంత్, పావురాల రాజు ,పావురాల స్వామి, ఎండి ఫిరోజ్, ఎండి. వహీద్, ఎండి గౌస్, పాక నాగరాజు, చెట్లపల్లి చిన్న రామస్వామి, చెట్లపల్లి నవీన్, పావురాల భూమయ్య, లక్ష్మణ్ రామనిగళ్ళ కిషన్, కోడేటి నర్సింహులు, నీల శంకర్, లింగోల లక్ష్మణ్, లింగోల్లా నర్సింగరావు, ఆర్ నాగరాజు, ఎండి షాదుల్లా తడకపల్లి ప్రభాకర్, చెట్లపల్లి పెద్ద రామస్వామి, సంజీవరెడ్డి , మహేందర్ రెడ్డి, పట్లూరి శంకర్ రెడ్డి, పిట్ల నర్సింహులు, రామనే నవీన్ తదితరులు తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో యవపూర్ గ్రామస్తులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking