గత 20 సంవత్సరాలుగా మెప్మాలో పనిచేస్తున్న సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆగస్టు 14న ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా

 

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. గత 20 సంవత్సరాలుగా మెప్మాలో పనిచేస్తున్న సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆగస్టు 14న ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పే స్కేల్ వర్తింపజేయడంపై మెప్మా సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి వారి కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు గారికి రాష్ట్ర మంత్రివర్యులు ఇంద్రకరన్ రెడ్డి గారికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం మంత్రి గారిని కలిసి మిఠాయిలు పంచి శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా పిడి మెప్మా డి సుభాష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ మంచి పని మా సిబ్బంది జీవితాలలో వెలుగులు నింపిందని ఇలాంటి ప్రభుత్వాలు చిరకాలం అధికారంలో ఉండాలని ఆకాంక్షించారు. గత 20 సంవత్సరాలుగా సేవలందిస్తున్న మెప్మా సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచిందని కొని ఆడారు .సహకరించిన రాష్ట్ర మంత్రివర్యులు కే తారక రామారావు గారికి, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారికి, ముఖ్యంగా ఎండి మెప్మా గారికి మరియు రెరా చైర్మన్ గా ఉన్న డాక్టర్ సత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా మెప్మా సిబ్బంది అందరూ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking