పొలాసలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుక

జగిత్యాల, ఆగస్టు 18: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు శుక్రవారం పొలాసలో ఘనంగా జరిగాయి. రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం సమీపంలో గౌడ యువజన సంఘం అద్యక్షులు ఓల్లాల రాజశేఖర్ గౌడ్ సారథ్యంలో జరిగిన ఈ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్తులు ఆరాధ్య దైవం సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గౌడ యువజన సంఘం ఉపాధ్యక్షులు గోట్టిపలుకుల రాజకుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి జుంగొని శంకర్ గౌడ్, కార్యదర్శి అనుపురపు సాయి కృష్ణ గౌడ్, కో క్యాషియర్ గడ్డం గంగాధర్ గౌడ్, బత్తిని రాజేష్ గౌడ్, బత్తిని శంకర్ గౌడ్, బత్తిని కొమరయ్య గౌడ్, ఓల్లాల శ్రీనివాస్ గౌడ్, దాసరి సాయి గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు అనపురపు సత్యనారాయణ గౌడ్, మడ్డి రవి గౌడ్, ఓల్లాల శంకర్ గౌడ్, సల్లూరి రాజేష్ గౌడ్, ఓల్లల వెంకన్న గౌడ్, అనపురపు నర్సయ్యా గౌడ్, జుంగోని శ్రీను గౌడ్,గొల్లపెల్లి సాయమ్మ మరియు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking