గణేష్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించిన సతీష్ యాదవ్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 18 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలం లో నీ అంకతి పల్లి గ్రామానికి చెందిన గణవేని గణేష్ ఇటీవల మరణించడంతో అతని కుటుంబ సభ్యులను శుక్రవారం యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి గడ్డం సతీష్ యాదవ్,జిల్లా అధ్యక్షురాలు పుట్ట లావణ్య యాదవ్ లు పరామర్శించి,ఒదార్చి ఆర్థిక సహాయం చేశారు.ఈ సంధర్భంగా యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి గడ్డం సతీష్ యాదవ్,జిల్లా అధ్యక్షురాలు పుట్ట లావణ్య యాదవ్ లు మాట్లాడుతూ…చనిపోయిన గణేష్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు.ప్రభుత్వం స్పందించి ఆ నిరుపేద కుటుంబానికి రు.5 లక్షలు ఇవ్వాలని,ఇంటి స్థలం మంజూరు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సహకార సంఘం డైరెక్టర్ పోచ యాదవ్,స్వప్న రెడ్డి యాదవ సంఘం సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking