మేడ్చెల్ మల్కాజిగిం జిల్లా ఎన్నికల పరిశీలకులు రహమ్మత్ అలీ
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నవంబర్ 7:
ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యతనిచ్చే దిశగా స్వచ్ఛమైన, పవిత్రమైన ఎన్నికలను నిర్వహించేందుకు జాతీయ ఎలక్షన్ కమీషన్ గత అనుభవాలతో ఎప్పటికప్పుడు నూతన మార్గదర్శకాలను రూపొందిస్తుందని మేడ్చెల్ మల్కాజిగిం జిల్లా ఎన్నికల పరిశీలకులు రహమ్మత్ అలీ అన్నారు.
గురువారం మేడ్చేల్ మల్కాజిగిరి జిల్లా విసి హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి మల్కాజిగరి నియోజక వర్గ ఎంఎల్ఎ మర్రిరాజశేఖర్రెడ్డి, జిల్లా ఎన్నికల అధికారి/ జిల్లా కలెక్టరు గౌతం పొట్రుతో కలిసి జిల్లా ఎన్నికల పరిశీలికులు రహమ్మత్ అలీ హాజరయ్యారు.ఈ సందర్భంగా పరిశీలకులు మాట్లాడుతూ గత ఎన్నికలలో జరిగి లోటు పాట్లను, చిన్న చిన్న అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో స్వచ్ఛమైన, పవిత్రమైన ఎన్నికలను నిర్వహించేందుకు గాను జాతీయ ఎన్నికల కమీషన్ అవసరమైన మార్గదర్శకాలను రూపొందిస్తూ ఎప్పటికప్పుడు సవరిస్తూ ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. ఇందులో భాగంగా స్పెషల్ సమ్మరీ రివిజన్ నిర్వహించేందుకు గాను తనను మేడ్చెల్ మల్కాజిగిరి జల్లాకు పరిశీలకులుగా నియమించడం జరిగిందని, దశల వారీగా ఈ స్పెషల్ సమ్మరీ రివిజన్ ను నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేసారి మేడ్చెల్ మల్కాజిగరి జిల్లాలో 2435 పోలింగ్ బూతులు ఉన్నప్పటకి ఓటింగ్ శాతం తక్కువగా ఉందని, ఈ శాతాన్ని పెంచవలసిన అవసరం ఎంతైన ఉందన్నారు. ఇందుకు జిల్లా యంత్రాంగంతో పాటు ప్రజా ప్రతినిధులు,రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో కృషి చేస్తే తప్పకుండా ఓటింగ్ శాతం పెరుగుతుందని అన్నారు. ఓటరు ఎన్రోల్మెంట్ ప్రక్రియను తీవ్రంగా పరిగణించి సవరణలు, డెత్ కేసులను ఎప్పటికప్పుడు సవరించేలా సంబంధిత ఫారాలలైన 6,6ఎ,7ఎ, 8లలో నమోదు చేసుకునేలా బిఎల్ఎలు, బిఎల్ఒలు ప్రజలకు తెలయజేసి ఓటరు జాబితాను అప్ డేట్ చేయాలన్నారు. సవరణ జాబితలో పెండింగ్ లో ఉన్న 6642 నమోదులను డిసెంబరు నాటికి పూర్తిచేయాలన్నారు.ఈ ఆర్ఓలు, పార్టీ ప్రతినిధులు, బిఎల్ఓలు, బిఎల్ఎలు బూతు, గ్రామీణ, మండల స్థాయిలలో క్రమం తప్పకుండా సమావేశాలను ఏర్పాటు చేసి ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలన్నారు. ఎలక్షన్ల సమయంలోనే కాకుండా బిఎల్ఒలతో పాటలు బిఎల్ఎలను నియమిస్తే ఏలాంటి లోపాలు జరుగకుండా ఓటరు నమోదు, ఓటరు జాబితా సవరణలు పారదర్శకంగా జరుగుతాయని సూచించారు. ఇందులో భాగంగా ఓటరు నమోదు ప్రక్రియలో ఏలాంటి జాప్యం జరుగకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకునేలా బిఎల్ఓలు, బిఎల్ఎలు యువతలో అవగాహాన పెంపొందించాలని రహమ్మత్ అలీ అన్నారు. అందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసుకొని బూతు, గ్రామీణ, మండల స్థాయిలలో అవగాహాన కార్యక్రమాలను నిర్వహించి యువతను చైతన్యపరచాలన్నారు. అంతే కాకుండా జిల్లాలో ఓటరు జాబితాలో లింగ సమస్య అధికంగా ఉందని, మహిళా ఓటర్ల శాతాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశానికి హాజరైన ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల ప్రతినిధులు వారి వారి సలహాలను, సూచనలను ఇవ్వవలసందిగా పరిశీలకులు కోరారు.
మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో 60 శాతం జిహెచ్ఎంసి పరిధిలో ఉందని, అందుకు గాను జనాభా ఎక్కువగా ఉందన్నారు. గ్రామీణ స్థాయిలో ఓటరు శాతం తగ్గుతుందన్నారు. ఎంఎల్ఎ తెలిపిన సమస్యలకు సమాధానమిస్తూ కలెక్టరు ఆన్ లైన్ లో నమోదు ప్రక్రియలో సాప్ట్ వేర్ సర్వర్ సమస్యను కేవలం ఎలక్షన్ కమీషన్ వారు మాత్రమే సవరించగలరని తెలపారు. జాబితాలో సవరణలను సకాలంలో సవరిస్తామని కలెక్టరు తెలిపారు. ఓటర్లు స్థల మార్పిడి జరిగనప్పుడు వారు ఫారం 8లో దరఖాస్తు చేసుకునేలా బఎల్ఎలు అవగాహాన కల్పించాలన్నారు. అంతే కాకుండా క్రమం తప్పకుండా సమావేశాలను నిర్వహించాలని స్వీప్ అధికారికి కలెక్టరు సూచించారు.
మల్కాజిగరి నియోజక వర్గ ఎంఎల్ఎ మర్రిరాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కొత్తగా ఆన్ లైన్ లో నమోదు చేసుకునే వారికి సాప్ట్ వేర్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, చాలా సమయం కేటాయించినప్పటికి రిజిస్ట్రేషన్ కావడం లేదని తెలిపారు. జియే ట్యాగింగ్ సకాలంలో జరుగనందున ఓటరు లిస్టులో ఒక కుటుంబంలోని వారికి వేరేవేరే బూతులలో కేటాయించడ జరుగుతుందని, ఓటింగ్ శాతం తగ్గడానికి ఇది ఒక కారణమన్నారు. బిఎల్ఓల రెమ్యూనరేషన చాలా తక్కువగా ఉందని, రెమ్యూనరేషన్ పెంచేందుకు మరియు హాస్టల్స్ లలో ఉండే విద్యార్థులకు ఓటరు నమోదుప్రక్రియలో చాలా సమస్యలు తలెత్తుతున్నాయని, వాటి పరిష్కారానికి గాను ఎలక్షన్ కమీషన్ దృష్టికి తీసుకుపోవాలని ఎంఎల్ఎ పరిశీలకులను కోరారు.
ఈ సమావేశంలో మేడ్చెల్ మల్కాజగిరి జిల్లా అదనపపు కలెక్టరు విజయేందర్ రెడ్డి, డిఆర్ఓ హరిప్రియ, ఆర్డిఓ సైదులు, స్వేప్ అధికారి సాంబశివరావు, వివిధ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.