ప్రభుత్వ అదీనంలోని ప్రభుత్వ భూమిని వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి అనుమతి గురించి తహశీల్దార్ కి వినతి పత్రం
ప్రజాబలం దండేపల్లి మండల రిపోర్టర్ నవంబర్ 07 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం ముత్యంపేట శివారు సర్వే నెం 17 లోని 34 గుంటల ప్రభుత్వ భూమిలో రైతులు తమ వరి ధాన్యాన్ని ఆరబోసుకొని ధాన్యాన్ని అమ్ముకునేవారు కానీ ప్రస్తుత వర్షాకాలం మొదలు అవ్వడంతోనే ఇట్టి 34 గుంటల ప్రభుత్వ భూమిలో అక్రమంగా కంది పంట వేసినారు,ఇందువల్ల ప్రస్తుత వరి పంట సీజన్లలో రైతులు తమ వరి ధాన్యాన్ని ఆరబోసుకొనుటకు వీలులేకుండా పోయింది.ఈ భూమి ఎత్తుగా ఉండడంతో వర్షాలు పడిన నీరు నిలువ ఉండదు అందువల్ల రైతులు ఇక్కడ వారి వరి ధాన్యాన్ని ఆరబోసుకొని తడవకుండా కాపాడుకొని అమ్ముకుంటారు ఇందువల్ల రైతులు నష్టానికి గురికావడం లేదు.పైన తెలిపిన విధంగా ఈ భూమి రైతులకు ఎంతో ప్రయోజన కరంగా ఉండేది ఇట్టి భూమిలో అక్రమంగా కందిపంట వేయడంతో ప్రస్తుత సీజన్ లో ఇక్కడ రైతులు వరి ధాన్యాన్ని ఆరబోసుకొనుటకు వీలులేనందున రైతులు ఆందోళన చెందుతున్నారు. కావున ఇట్టి భూమిలో అక్రమంగా వేసిన కంది పంటను తీసివేయించి భూమిని చదును చేపించి రైతులు వారి వరి ధాన్యాన్ని ఈ స్థలంలో ఆరబోసుకొనుటకు లేదా వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి గ్రామ రైతుల ప్రయోజనార్థం అనుమతిని ఇప్పించగలరని తహశీల్దార్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కొండా నరేష్,ముత్తే వేంకటేష్, తదితరులు పాల్గొన్నారు.