శిథిలావస్థలో ఉన్న ఇండ్ల కూల్చివేత

పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ మామిండ్ల జ్యోతి కృష్ణ ముదిరాజ్, కౌన్సిలర్ శ్రీశైలం గౌడ్ .

తూప్రాన్ ప్రజాబలం సెప్టెంబర్ 4 న్యూస్ :-

మెదక్ జిల్లా
తూప్రాన్ మున్సిపాలిటీలోని 15వ వార్డులో మున్సిపల్ చైర్ పర్సన్ మామిండ్ల జ్యోతి కృష్ణ ముదిరాజ్, 15 వార్డ్ కౌన్సిలర్ శ్రీశైలం గౌడ్ భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇండ్లను, శిథిలావస్థలో ఉన్న ఇండ్లను బుధవారం రోజున మున్సిపల్ అధికారులతో కూల్చి ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మావిండ్ల జ్యోతి కృష్ణ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని శిథిలావస్థలో ఉన్న పాత ఇండ్లను తీసివేయవలసిందిగా వార్డు ప్రజలు కోరగా, మున్సిపల్ చైర్ పర్సన్ మాటతో ఏకీభవించిన ప్రజలు పాత శిథిలావస్థలో ఉన్న ఇండ్లను తొలగించడానికి ఒప్పుకోవడంతో జెసిబి సహాయంతో తీసివేయవలసిందిగా మున్సిపల్ ఉద్యోగులను ఆదేశించారు. వెంటనే స్పందించిన మున్సిపల్ సిబ్బంది జెసిబి సహాయంతో సురక్షితంగా తీసివేయడం జరిగింది.తదనంతరం గ్రంథాలయంలో చేరిన వర్షపు నీటికి ఏర్పడ్డ నాచుని బ్లీచింగ్ పౌడర్ తో శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శ్రీశైలం గౌడ్,పల్లెర జ్యోతి రవీందర్ గుప్తా,జమాల్పూర్ లక్ష్మీబాయి నర్సోజి, మున్సిపల్ సిబ్బంది అన్వర్ ,భాస్కర్, మధు, వినోద్,వార్డు ప్రజలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking