మున్సిపల్ కమిషనర్ కల్లేడ రాజశేఖర్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 16 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని కరీంనగర్ చౌరస్తా లోని మటన్ షాపులలో మున్సిపల్ సిబ్బంది ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది.పలు మార్లు హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా కరీంనగర్ చౌరస్తా లోని మటన్ షాపులలో చనిపోయిన, పాడైపోయిన మటన్ విక్రయిస్తున్న షాపు ల పై చర్యలు తీసుకొని అట్టి షాపు లను సీజ్ చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కల్లేడ రాజశేఖర్, శానిటరీ ఇన్స్పెక్టర్ అజీమ్,జవాన్ సుద్దాల దినేష్, సిబ్బంది పాల్గొన్నారు.