డబల్ బెడ్ రూమ్ పేరుతో ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలిు డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి..
ఉప్పల్ ప్రజాబలం ప్రతినిధి:హైదరాబాద్: కోల్లుర్ డబల్ బెడ్ రూమ్ పేరుతో ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి సూచించారు. కొల్లూర్ ప్రాంతంలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో కొందరు మోసగాళ్లు ఫోన్ కాల్స్ చేస్తున్నారని సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ప్రజలు మరియు లబ్ధిదారులు ఈ విధమైన ఫోన్ కాల్స్‌కు బలవకూడదని, ఎలాంటి అనుమానాస్పద సమాచారాన్ని నమ్మరాదని ఆమె హెచ్చరించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సంబంధిత అన్ని విషయాలను అధికారిక వేదికల ద్వారా మాత్రమే తెలుసుకోవాలని సూచించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండి, ఇలాంటి మోసపూరిత చర్యల గురించి తెలియజేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) విజ్ఞప్తి చేసింది.