నగరంలో వీధి కుక్కలు, కోతుల బెడద నుండి ప్రజలను కాపాడాలి
సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం
కరీంనగర్ ప్రజా బలం ప్రతినిధి జూలై 9
నగరంలోని అర్హులైన పేదలందరికీ ఇల్లు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని, వీధి కుక్కలు, కోతుల బెడద నుండి నగరవాసులను రక్షించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ స్మార్ట్ సిటీగా ఎంపికైన కరీంనగర్ లో అనేక సమస్యలు ఉన్నాయని గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా అభివృద్ధికి నోచుకోలేకపోయిందని, ఇప్పుడైనా నగరపాలక అధికారులు ప్రజాప్రతినిధులు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు. నగరంలో వీధి కుక్కలు కోతుల బెడద విపరీతంగా ఉందని చిన్నపిల్లల్ని బైకుల మీద వెళుతున్న వారిని వెంబడించి కరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు నివారణ చర్యలు చేపట్టకుండా చోద్యం చూస్తున్నారని అన్నారు.
ప్రధానంగా గత 20 సంవత్సరాలు నుండి డంపింగ్ యార్డ్ ఎండాకాలంలో తగలబడుతూ దట్టమైన పొగ వ్యాపిస్తూ నగరవాసులను ఉక్కిరి,బిక్కిరి చేస్తుందని అన్నారు. దీని మూలంగా శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని, వర్షాకాలంలో డంపింగ్ యార్డ్ తడవడం మూలంగా దుర్వాసన వస్తుందని అన్నారు.
రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు నత్తనడకగా జరుగుతుందని, పలుమార్లు రైల్వేగేట్ పడడం మూలంగా అంబులెన్స్ సైతం ట్రాఫిక్ లో చిక్కుకొని పేషెంట్లు ప్రాణాలు కోల్పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీగల వంతెన నిర్మాణంలో అక్రమాలు జరిగాయని నాసిరకం పనులు చేయడం మూలంగా ఇప్పటికీ నాలుగు సార్లు తీగన వంతెన బ్రిడ్జిపై రోడ్డు పాడైందని అన్నారు. పక్కనే మానేరు డ్యాం ఉన్నప్పటికీ తాగునీటి కొరత ఉందని రెండు, మూడు రోజులకు ఒకసారి త్రాగునీరు సరపర చేస్తూన్నారని అది సరైన సమయపాలన లేకుండా నీటి విడుదల చేస్తున్నారని అన్నారు. పేరుకే స్మార్ట్ సిటీగా ఉన్న కరీంనగర్లో రోడ్లు అద్వానంగా ఉన్నాయని సరైన డ్రైనేజీ సౌకర్యం లేదని మునిసిపల్ అధికారులు పన్నుల మీద పెట్టిన శ్రద్ధ నగరవాసులకు సౌకర్యాలు కల్పించడంలో పెట్టడం లేదని అన్నారు. స్మార్ట్ సిటీ లో నిధుల దుర్వినియోగం జరిగిందని పనుల్లో అవినీతి అక్రమాలు జరిగాయని, నిధులు దారి మళ్లించిన వారిపై విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి అక్రమార్కులపై కేసులు నమోదు చేసి కాంట్రాక్టర్ల లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే నిర్మించి ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు పంచాలని లేదంటే సిపిఎం ఆధ్వర్యంలో ఆక్రమించి పేదలకు కేటాయిస్తామని హెచ్చరించారు. అనంతరం నగర మేయర్ సునీల్ రావు కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యులు పున్నంరవి,పుల్లెల మల్లయ్య,కొంపల్లి సాగర్, నాయకులు గజ్జల శ్రీకాంత్, గాజుల కనకరాజు, రోహిత్, కే.నాగమణి, ద్యవా అన్నపూర్ణ, రోజా, డి.శ్రీకాంత్, అనిల్, చెలికాని శ్రీనివాస్, ఆరిఫ్ , మొహిద్దిన్, అనంతొజురమేష్, మహమ్మద్ అమీర్, ప్రీతం, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
