జిల్లా క్రీడా యువజన సర్వీసుల శాఖ అధికారి కీర్తి రాజ్వీరు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 19 : మంచిర్యాల జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో వేసవి క్రీడా శిబిరాల నిర్వహణ కొరకు ఆసక్తి గల సీనియర్ క్రీడాకారులు,పి.ఈ.టి.లు, పి.డి.లు వివరాలు సమర్పించాలని జిల్లా క్రీడా యువజన సర్వీసుల శాఖ అధికారి కీర్తి రాజ్వీరు ఒక ప్రకటనలో తెలిపారు.క్రీడా అంశం,గ్రామం,మండలం ఇతరత్రా పూర్తి వివరాలను ఈ నెల 26వ తేదీన జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని 2వ అంతస్తులో గల జిల్లా క్రీడాధికార సంస్థ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అందజేయాలని తెలిపారు. మే 1 నుండి 31వ తేదీ వరకు శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని,వివరాలకు 9963539234, 9866458725 లలో సంప్రదించవచ్చని తెలిపారు.