ప్రజా ప్రతినిధులు, అధికారుల సమిష్టి కృషితో గ్రామాల అభివృద్ధి

 

తెలంగాణ గ్రామాలను చూసి దేశం ఆశ్చర్యపోతున్నది

పల్లె, పట్టణ ప్రగతి అద్భుతంగా పనిచేస్తుంది

జిల్లాస్థాయి ఉత్తమ గ్రామపంచాయతీల అవార్డుల ప్రధానోత్సవము.

… రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీష్ రావు

సంగారెడ్డి మార్చి:27 ప్రజ బలం ప్రతినిది:
ప్రజా ప్రతినిధులు, అధికారుల సమిష్టి కృషితో గ్రామాలు అభివృద్ధి దిశగా పయనిస్తున్నాయని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.
జాతీయ పంచాయతీ(2021-22) అవార్డుల కార్యక్రమంలో భాగంగా, సోమవారం కులబ్ గూర్ జిఆర్ కె ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీలుగా ఎంపికైన గ్రామ పంచాయతీలకు మంత్రి అవార్డులను ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని (17) గ్రామ పంచాయతీలు 9 కేటగిరీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి 27 జిల్లా స్థాయి అవార్డులు అందుకోవడంపై సంతోషం వ్యక్తం చేస్తూ సంబంధిత ప్రజా ప్రతినిధులు అధికారులను అభినందించారు.
తెలంగాణలోని ప్రతి పల్లెకు ఇంటింటికి ప్రతి రోజు నీరు వస్తుందని,24 గంటల కరెంటు ఇస్తున్నామని, రైతులకు ఏం కావాలో సీఎం అది చేస్తున్నారని అన్నారు. తెలంగాణ తెలంగాణ దేశానికి మోడల్ గా మారిందని అన్నారు.
ఇతర రాష్ట్రాలలో తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు.
వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 10 వేలు సాయం చేస్తామని సీఎం ప్రకటించారన్నారు.
ప్రధానమంత్రి సంసద్ యోజన పథకంలో 10 ఉత్తమ గ్రామ పంచాయతీలు తెలంగాణ గ్రామ పంచాయతీలేనని తెలిపారు.
ఏప్రిల్ ,1 నుంచి ఏ నిధులైనా నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్లలో జమ చేస్తామని మంత్రి చెప్పారు.
పని చేసిన వెంటనే బిల్లులు చెల్లించుకునే అవకాశం మీకే కల్పించామన్నారు.
గతంలో సర్పంచ్ లకు కాలిపోయిన మోటర్లకు రిపేర్ చేయించడం, బోర్లను వేయించడంతోనే 5 సంవత్సరాల కాల పరిమితి పూర్తయ్యేదన్నారు.
తెలంగాణ వచ్చాక నీళ్ల గోల లేదు కరెంటు సమస్య లేదన్నారు.
ప్రతి గ్రామంలో ట్యాంకర్లు ,పల్లె ప్రకృతి వనాలు, సెగ్రీగేషన్ షెడ్లు, ట్రాలీ, ట్యాంకర్ ట్రాక్టర్ ఉన్నాయని, పారిశుద్ధ్యం, పచ్చదనంతో గ్రామాల రూపురేఖలు మారాయని మంత్రి అన్నారు.
రాబోయే రోజుల్లో సంగారెడ్డి జిల్లాకు రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు రావాలని మంత్రి ఆకాంక్షించారు.
*అవార్డులు అందుకున్న గ్రామపంచాయతీలు
కంకోల్, చిక్మద్దూర్, గొంగ్లూర్, నిజాంపేట్, చిట్కుల్, కర్దనూర్, హరిదాస్పూర్, జానకంపేట, సజ్జాపూర్, ఎద్దు మైలారం, కోనాపూర్, ఫసల్ వాది, మొగుడంపల్లి, బొంతపల్లి, హుస్సేల్లి, కొడకంచి, హరిదాస్పూర్.
ఈ కార్యక్రమంలో ZP చైర్మన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి, రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, శాసనసభ్యులు మాణిక్ రావు, క్రాంతి కిరణ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్, జెడ్పిసిఈఓ ఎల్లయ్య, డి ఆర్ డి ఓ శ్రీనివాసరావు, జడ్పిటిసిలు, ఎంపీపీలు ఎంపీటీసీలు, సర్పంచులు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking