చండీ హోమం, కుంకుమార్చన, అన్నదాన కార్యక్రమాలు.
హాజరైతున్న భక్తులు ప్రజాప్రతినిధులు.
మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-
మెదక్ జిల్లా వ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
తూప్రాన్ పట్టణంలో దసరా పండుగ పురస్కరించుకొని దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సందర్భంగా తూప్రాన్ మహంకాళి ఆలయం వద్ద దుర్గాదేవి భక్తబృందం తరఫున , దేవి ఉపాసకులు సోమయాజుల రవీంద్ర శర్మ అద్వర్యంలొ బాలాంజనేయ స్వామి , బ్రాహ్మణపల్లి లలితా పరమేశ్వరి ఆలయం వద్ద , తూప్రాన్ దేవి గార్డెన్ దేవి గార్డెన్ నందు శ్రీ దేవి భక్త బృందం వ్యవస్థాపకులు శలాక రాజేశ్వర శర్మ ఆధ్వర్యంలో ప్రతిష్టించబడిన దుర్గా మాత విగ్రహ మంటపాల వద్ద కొనసాగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు తూప్రాన్ పట్టణంలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. స్థానిక దేవీ గార్డెన్స్ లో దుర్గాదేవీ భక్త బృందం వ్యవస్థాపకులు సలాక రాజేశ్వర శర్మ అధ్వర్యంలో ప్రతిష్టించబడిన దుర్గా మాత విగ్రహ మండపం వద్ద భక్తులచే చండీ హోమం,మహిళల చేత కుంకు మార్చన, తదితర కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో బాగంగా అమ్మవారు భక్తులకు ఒక్కోరోజు ఒక్కో అవతారంలో దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల మూడవ రోజు మంగళవారం అమ్మవారు అన్నపూర్ణా దేవి అలకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. విగ్రహ మండపం దగ్గర ఉదయం నుంచి రాత్రి వరకు పలు రకాలైన విశేష పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు నిర్వాహకులు రాజేశ్వర శర్మ పేర్కొన్నారు. ప్రముఖ పండితులు ప్రముఖ గాయకులు శశాంక్ శర్మ అమ్మవారి మండపం వద్ద తన భక్త బృందంతో దైవభక్తి పాటలు అమ్మవారి పాటలు గాన అమృతంతో మైమరిపిస్తూ అమ్మవారి వచ్చే దర్శనం కోసం వచ్చే భక్తులను భక్తి మార్గంలో తన్వయత్వం చందేటట్టు తన భక్తి పాటలతో భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి . అమ్మవారి దర్శించుకుని ప్రత్యేక పూజలు జర్నలిస్టులు
శివశంకర్ గౌడ్ ,
గడ్డం ప్రశాంత్ కుమార్, నాయకులు బొల్లబోయిన మహేష్ యాదవ్, వెంకట్రాం రెడ్డి , ఆంజనేయులు, గడ్డం వెంకటేష్, దామోదర్ రెడ్డి , ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.