వివిధ దేవాలయాల్లో విఘ్నేశ్వరునికి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు

సంగారెడ్డి సెప్టెంబర్ 28 (); సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణంలో స్వాతంత్ర సమరయోధుడు కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వినాయక మండపాలను దర్శించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ పట్టణంలోని వివిధ దేవాలయాల్లో విఘ్నేశ్వరునికి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్త బృందానికి మరియు అర్చకుడికి ధన్యవాదాలు తెలుపుతూ అన్ని దేవాలయాల్లో ఉన్న గణేష్ లకు శాలువా, పండ్లు, పూలు, టెంకాయ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ విగ్నేశ్వరులకు అనునిత్యం సేవలు చేస్తున్న అర్చకులకు ఆలయ కమిటీ పెద్దలకు శాలువాలతో ఘనంగా సన్మానం చేసి ఆ యొక్క విఘ్నేశ్వరుడి కృపతో ధర్మ సంస్థాపన కోసం సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రాప్తించాలని వేడుకంటూ అదేవిధంగా ధర్మాన్ని కాపాడడంలో ఎప్పుడూ ముందుండాలని అందుకు ఆ విగ్నేశ్వరుడు ప్రతి మంచి కార్యంలో విజయాన్ని ప్రాప్తిస్తాడని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో అన్ని దేవాలయాల్లో ఉన్న అర్చకులు, భక్త బృంద కమిటీలు మరియు విఘ్నేశ్వరుడి ఊరేగింపు కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking