వివిధ రకాల ఏకదంతుని లడ్డూల వేలం పాట, పోటా పోటీగా నిర్వహించడం జరిగింది

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 28 సెప్టెంబర్ 2023: మణికొండ పురపాలక సంఘం పరిధిలోని పంచవటి కాలనీలో నిలిచిన వివిధ రకాల ఏకదంతుని లడ్డూల వేలం పాట, పోటా పోటీగా నిర్వహించడం జరిగింది ఈ వేలం పాటలో రోడ్ నెంబర్ 5 లో గల గణేష్ మండపంలోని లడ్డూను గూడ దిలీప్ రెడ్డి 5,59,000 దక్కించు కోగా, మహిళలకు సంబంధించిన నవరాత్రులు పూజ లందుకొన్న విగ్న రాజా లడ్డును 2,90,000 లకు గాను సాని కొమ్ము వాసంతి శిరీష రామ సుబ్బా రెడ్డి చిక్కించుకోగా, పిల్లల ఆధ్వర్యం లోని బాల గణేష్ లడ్డుని 3,25,000 లకు గాను చరిష్మా రెడ్డి కైవసం చేసుకున్నారు అట్లాగే లడ్డులే కాకుండా స్వామివారి శేష వస్త్రాలను ‌‌‌‌‌‌‌‌‍రెడ్డి గారి రాఘవేందర్ రెడ్డి 2,15,000 లకు కైవసం చేసుకోవడం జరిగినది తదుపరి అంగరంగ వైభవంగా జరిగిన లంబోదరుని ఊరేగింపులో పిల్లలు, పెద్దలు భాజా భజంత్రీలతో కూడిన నృత్యాలతో పార్వతీ నందన గణనాథుని నిమజ్జనం నిర్వహించడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking