తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ ఇంజనీర్స్ ఫెడరేషన్ వారి 20 23 డైరీ ని ఆవిష్కరించిన దేవులపల్లి ప్రభాకర్
తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ ఇంజనీర్స్ ఫెడరేషన్ వారి 20 23 డైరీ ని దేవులపల్లి ప్రభాకర్ రావు చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ జెన్కొ, ట్రాన్స్కో గారు హైదరాబాదులో ఫిబ్రవరి 10న ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఫెడరేషన్ అధ్యక్షులు దేవల్ల సమ్మయ్య గారు, కార్యదర్శి కొట్టే సతీష్ ,
కె రాజుTSSPDCL ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ పి వీరేశలింగం తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో విద్యుత్ సమస్యను అధిగమించడంతోపాటు సంస్థ నడవడానికి అన్ని రకాలుగా రాత్రి పగలు సంస్థ కోసం పనిచేస్తున్న ఇంజనీరింగ్ సిబ్బందికి శ్రీ దేవులపల్లి ప్రభాకర్ రావు చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గారు అభినందనలు తెలిపారు. ఈ సహకారం భవిష్యత్తులో కూడా ఇలాగే ఉండాలని ఆయన అన్నారు.