స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ధరణి దరఖాస్తులను నిర్ణీత గడువు లోపు సమస్యలను పరిష్కరించాలి మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేంద్ర రెడ్డి

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మార్చి 6:
బుధవారం ఘట్కేసర్ మండల తహసీల్దారు కార్యాలయంలో స్పెషల్ డ్రైవ్ లో ధరణి దరఖాస్తుల సమస్యల పరిష్కార విధానాన్ని అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఇందులో భాగంగా ఘట్కేసర్ లో ఏర్పాటు చేసిన సేవ కేంద్రాన్ని తనిఖీ చేసి దరఖాస్తుల ప్రక్రియను పర్యవేక్షించి, అదనపు కలెక్టర్ అధికారులకు, ఆపరేటర్లకు పలు సూచనలు చేశారు. ధరణి దరఖాస్తుల పరిష్కారానికి రికార్డులను పరిశీలించి, క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలన్నారు. ప్రత్యేక డ్రైవ్‌లో నిర్దేశిత సమయంలోగా ధరణి మాడ్యూల్స్‌ ప్రకారం చర్యలు చేపట్టాలన్నారు. పారదర్శకంగా ప్రజలకు సేవలందించాలని అదనపు కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమాలలో ఘట్కేసర్ తహసీల్దార్ రజని ,సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking