ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామాల భూ నిర్వాసితులకు పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించాలని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 12 : మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామాల భూ నిర్వాసితులకు పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం బిజెపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో ముంపు బాధితులతో కలిసి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ…ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టి 14 ఎండ్లు గడిచిన భూ నిర్వాసితుల సమస్యలు వారికి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని అన్నారు.అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఉన్న దివాకర్ రావు,ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ఇద్దరు కూడా కమిషన్లు దండుకుని భూ నిర్వాసితులను మోసం చేశారని,ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 ఎండ్లు అయిన ఎమ్మెల్యే దివాకర్ రావు భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించలేదు. ఎల్లంపల్లి భూ నిర్వాసితుల పెండింగ్ లో బకాయిలు చెల్లించే వరకు వారికి అండగా ఉండి వారికి బకాయలు చెల్లించే వరకు పోరాటం చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా నాయకులు మండల నాయకులు భూ నిర్వాసితులకు తదితరులు పాల్గొన్నారు.