భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి ఏప్రిల్ 12 (ప్రజాబలం) కొత్తగూడెం డా.బి.ఆర్ అంబేద్కర్ 132 వ జయంతి వేడుకలలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్ర గ్రంధాలయం ఆధ్వర్యంలో అంబేద్కర్ ఇతివృత్తంగా కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ దిండిగల రాజేందర్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ప్రముఖ కవి శ్రీ ఎం ఆర్ జి కే మూర్తి విచ్చేసారు గ్రంథాలయ డైరెక్టర్లు శ్రీయుతులు మారె భాస్కర్ రావు అక్కిరాజు గణేష్ శ్రీమతి వరలక్ష్మీదేవి జి. మణిమృదుల నవీన్ ఆఫీస్ ఇంచార్జ్ శాఖ గ్రంథ పాలకులు మధుబాబు గ్రంథాలయ సిబ్బంది పరీక్షార్థులు ప్రముఖ కవులు హాజరై కార్యక్రమం జయప్రదం చేసారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ కవయిత్రి , రచయిత్రి రేడియో వ్యాఖ్యాత ఉపాధ్యాయిని ఐన శ్రీమతి తురుమెళ్ళ కళ్యాణి అను సంధాన కర్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కవి సమ్మేళనం అనంతరం కవితా గానం తో అలరించిన కవివరేణ్యులైన శ్రీయుతులు బుచ్చయ్య చిట్టి మధు కృష్ణ రాజేష్ లను శ్రీమతులు కళ్యాణి వై .పద్మ లను చిన్నారి తేజస్విని ని ఛైర్మన్ అతిథులు దుశ్శాలువాలతో సత్కరించారు.