ఓటరు జాబితాలో తొలగించిన ఓటర్ల వివరాలను మరోసారి ధృవీకరించాలి
మేడ్చల్ ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్ 12:బుధవారం హైదరాబాద్ నుండి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టి. రవికిరణ్ తో కలిసి జిల్లా కలెక్టర్ లతో ఓటర్ జాబితా లో పి.ఎస్.ఈ ఎంట్రీ ధృవీకరణ, ఓటర్ ఎపిక్ కార్డుల జారీ, బూత్ లెవెల్ అధికారుల నియామకం అంశాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, కీసర ఆర్డీవో రవి,కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్నఅదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ కార్యక్రమాన్ని పకడ్భందీగా నిర్వహిస్తున్నామని ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కి వివరించారు. జాబితాలో ఒకే ఓటర్ ఫోటోలు, వివరాలు రెండుమార్లు ప్రచురించిన వాటిని పరిశీలించి తొలిగిస్తున్నాము అని తెలిపినారు. ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల మేరకు డాక్యుమెంట్లు అన్ని ఉన్నాయో లేదో పరిశీలించి, ఏమాత్రం లోపాలకు తావులేకండా అప్ డేట్ చేస్తామని అన్నారు . జిల్లా వ్యాప్తంగా ఓటర్ల తుది జాబితాను కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు పకడ్భందీగా ఉండేలా అధికారులు, సిబ్బందితో పనులు జరుగుతున్నాయని ఏమాత్రం లోపాలకు తావులేకుండా చర్యలు చేపడుతున్నామని అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, వివరించారు.