ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..ఈరోజు నిర్మల్ లోని సిపిఎం పార్టీ కార్యాలయంలో వామపక్ష పార్టీల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు.దుర్గం నూతన్ కుమార్, సిపిఐ జిల్లా సీనియర్ నాయకులు ఎస్.ఎన్ రెడ్డి ,సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంతా జిల్లా కార్యదర్శి (కే.రాజన్న,సిపిఐ ఎం జిల్లా కమిటీ సభ్యులు.డాకూర్ తిరుపతి,నిర్మల్ పట్టణ నాయకులు చందుల సాయికిరణ్,వెస్లీ,బర్కుంట గంగారం లు
పాల్గొన్నారు.కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలంపాటను రద్దు చేయాలని,బొగ్గు బ్లాక్ లను నేరుగా సింగరేణికి అప్పగించాలని కోరుతూ జులై ఐదు నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఉదయం 11 గంటలకు జరిగే ధర్నా జయప్రదం చేయాలని వామపక్ష పార్టీలు కార్యకర్తలకు ప్రజలకు పిలుపునిచ్చాయీ
Next Post