కలెక్టర్ కార్యాలయం ముందు యాదవ సంఘం నాయకుల ధర్నా కలెక్టర్ కు వినతిపత్రం

మెదక్ జనవరి 29 ప్రాజబలం న్యూస్:-మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందుఅఖిల భారత యాదవ సంఘం ఆద్వర్యంలో గొల్ల కురుమలు ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వంలో మాజి సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా జిల్లా నుండి అనేకమంది గొల్ల కురుమలు డీడీలు కట్టడం జరిగింది కానీ గత ప్రభుత్వం గొర్రెల పంపిణీ చేయలేదని ఆవేదన చెందారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డీడీలు కట్టిన వారికి గొర్రెలు పంపిణీ చేయాలని గత ప్రభుత్వానికి విన్నపం చేసిన పట్టించుకోలేదని సూచించారు మాజీ సీఎం కేసీఆర్ గొల్ల కురుమలను డీడీలు కట్టించుకుని గొర్రెలు పంపిణీ చేయకుండా మోసం చేశాడని అన్నారు.
వెంటనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి డీడీలు కట్టిన గొల్ల కురుమలకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా యాదవ మహాసభ మెదక్ జిల్లా అధ్యక్షులు మల్లేష్ యాదవ్, గొల్ల కురుమలు, యాదవ సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking