కాంగ్రెస్ పార్టీ మహానాయకుడిని కోల్పోయింది

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

జనవరి 29/01/2024నిర్మల్ కు చెందిన మాజీ మంత్రి నర్సారెడ్డి గారి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,నిర్మల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ,నిర్మల్ డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాస గృహం వైట్ హౌస్ లో నర్సారెడ్డి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్బంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతు నర్సారెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో పిసిసి చీఫ్ గా కాంగ్రెస్ పార్టీ కి సేవలు అందించారని గుర్తు చేశారు. అయన కొన్ని పర్యాయాలుగా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రిగా ప్రజలకు సేవలు అందించారన్నారు. కాంగ్రెస్ పార్టీ నేడు ఒక గొప్ప నేతను కోల్పోయిందని పేర్కొన్నారు. వారి మరణం యావత్ కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటని,మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలుపుతూ…అయన పవిత్ర ఆత్మకు శాంతికి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తో పాటు నిర్మల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి ధనసరి సీతక్క .డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు. ఖానాపూర్ శాసన సభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking