కాంగ్రెస్ సీనియ‌ర్ నేత న‌ర్పారెడ్డికి మీరిచ్చే గౌర‌వం ఇదేనా?

ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు జ‌ర‌ప‌క‌పోవ‌డం శోచ‌నీయం: మాజీ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ పీసీసీ అధ్య‌క్షుడు, మాజీ మంత్రి పి.న‌ర్సారెడ్డి అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపకపోవడాన్ని మాజీ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తీవ్రంగా ఖండించించారు. అప్పటి సీఎం జలగం వెంగళరావు మంత్రివర్గంలో నీటి పారుదల శాఖ, రెవెన్యూ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశార‌ని, వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఆ త‌ర్వాత ఎంపీగా ప్ర‌జా సేవ‌లో కొనసాగిన ఆజాత శత్రువు లాంటి న‌ర్సారెడ్డి అంత్య‌క్రియ‌ల‌ను అధికారికంగా నిర్వహించక‌పోవ‌డం శోచ‌నీయ‌మ‌న్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ అంత్యక్రియలు జరపకపోవడం వెనుక అంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు

Leave A Reply

Your email address will not be published.

Breaking