కొరట్లగూడెం గ్రామంలో రైతుల ఆధ్వర్యంలో ధర్నా

ఖమ్మం ప్రతినిధి జూన్ 3 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కోరట్ల గూడెం తెలంగాణ పిసిసి పిలుపు మేరకు పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం కొరట్లగూడెం గ్రామంలో పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ కన్వీనర్ బచ్చలకూరి నాగరాజు ఆధ్వర్యంలో రైతులకు ఇచ్చిన హామీ మేనిఫెస్టో లో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి, ఈరోజు వరకు కూడా రుణమాఫీ చేయకుండా కాలయాపన చేస్తూ రైతులను మోసం చేయడాన్ని,నిరసిస్తూ బ్యాంకుల్లో రుణమున్న రైతుల బ్యాంకు వివరములు తెలిపి గ్రామంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ నందు కేసీఆర్ కి పోస్టు చేశారు.ఈ కార్యక్రమంలో రైతులు కొత్తపల్లి సుబ్బారావు గుండా శoబయ్య తోట సుబ్బారావు సుంకర వెంకటేశ్వర్లు వెలిశాల నాగేశ్వరరావు బచ్చలకూరి వెంకయ్య బచ్చలకూరి ప్రసాద్, డేగల సీతారావమ్మ కనకం గురమ్మ ,బచ్చలకూరి సునీత, మారుతి సురేష్ సుంకర భూచక్రవర్తి, మార్తి చిన్న వెంకయ్య, కొరట్ల గూడెం రైతులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking