షుగర్ వ్యాధి రాకుండా వ్యాయామం తో నియంత్రించవచ్చు : డయాబెటిస్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ లయన్ జీ.ఆర్. సుజాత
తూప్రాన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిస్ క్యాంపు
తూప్రాన్, జులై, 17.
షుగర్ వ్యాధి రాకుండా ప్రతినిత్యం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల షుగర్ వ్యాధి అరికట్టవచ్చు అని డయాబెటిస్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ లయన్ జి ఆర్ సుజాత అన్నారు. సోమవారం ఉదయం తూప్రాన్ లోని శుష్మా హాస్పిటల్స్ ఆవరణలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిస్ శిబిరాన్ని జి ఆర్ సుజాత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మధుమేహం ను చక్కెర వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ అని వ్యవహరిస్తారని తెలిపారు. ఈ వ్యాధి, ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం, రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత అని వివరించారు. అతిమూత్రం (పాలీయూరియా), దాహం ఎక్కువగా వేయడం (పాలీడిప్సియా), మందగించిన చూపు, కారణం లేకుండా బరువు తగ్గడం, బద్ధకం దీని ముఖ్య లక్షణాలని పేర్కొన్నారు. మధుమేహం లేదా చక్కెర వ్యాధిని సాధారణంగా రక్తంలో మితి మీరిన చక్కెర స్థాయిని బట్టి గుర్తిస్తారని, ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం భారత దేశం, చైనా, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అత్యధికంగా ఈ వ్యాధి ప్రబలి ఉన్నదన్నారు. ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించే మందులు లేవు. జీవితాంతం తగిన జాగ్రత్తలు తీసుకొన్నట్లయితే దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యం. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన మూడు డయాబెటిస్ మెల్లిటస్ రకాలు: వివిధ రకాల కారణాల వల్ల కలిగే డయాబెటిస్ మెల్లిటస్ టైప్ 1, డయాబెటిస్ మెల్లిటస్ టైప్ 2, జెస్టేషనల్ డయాబెటిస్ (గర్భిణీలలో వచ్చే డయాబెటిస్). అయినా, అన్ని రకాల మధుమేహాలకు మూల కారణం క్లోమ గ్రంధిలోని బీటా కణాలు పెరిగిన గ్లూకోస్ స్థాయిని అరికట్టడానికి సరిపడినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడమే నని తెలిపారు. మొదటి రకం డయాబెటిస్ సాధారణంగా బీటా కణాలను మన శరీరం స్వయంగా నాశనం చేయడం (ఆటోఇమ్యూనిటీ) వల్ల కలుగుతుందని. రెండవ రకం డయాబెటిస్‌లో ఇన్సులిన్ నిరోధకత వస్తుంది. దీనివల్ల అధికంగా ఇన్సులిన్ కావలసి వస్తుంది, బీటా కణాలు ఈ డిమాండ్ తట్టుకోలేనప్పుడు డయాబెటిస్ కలుగుతుంది. జెస్టేషనల్ డయాబెటిస్‌లో కూడా ఇన్సులిన్ నిరోధకత అగుపిస్తుంది. జెస్టేషనల్ డయాబెటిస్ సర్వసాధారణంగా ప్రసవం తర్వాత తగ్గిపోతుంది, కానీ మొదటి రకం, రెండవ రకం మధుమేహాలు మాత్రం దీర్ఘకాలికంగా ఉంటాయి. 1921లో ఇన్సులిన్ అందుబాటులోకి రావడంతో అన్ని రకాలను నియంత్రించడం సాధ్యమయ్యింది. ఆహార అలవాట్ల మార్పు కూడా భాగమయినప్పటికీ, ఇన్సులిన్ ఉత్పత్తి లేని మొదటి రకాన్ని నియంత్రించడానికి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వటం తప్పనిసరి మార్గం. రెండవ రకం ఆహార అలవాట్ల మార్పు, ఆంటీడయాబెటిక్ మందుల వాడకం వల్ల, అప్పుడప్పుడు ఇన్సులిన్ వాడకం వల్ల నియంత్రించవచ్చు. ఇంతకుమునుపు ఇన్సులిన్ పందుల క్లోమాల నుండి తీయబడేది, ప్రస్తుతము చాలా వరకు ఇన్సులిన్ ఉత్పత్తి జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా జరుగుతుంది. ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతులవల్ల ఉత్పత్తి చేయబడే ఇన్సులిన్ మానవ సహజ ఇన్సులిన్‌కు పూర్తి కాపీగా గాని, వివిధ ఆన్‌సెట్ అఫ్ యాక్షన్, యాక్షన్ చూపబడే సమయం ఉండే విధంగా తయారుచేయబడుతున్నాయి. ఇన్సులిన్‌ను ఇన్సులిన్ పంపుల ద్వారా నిర్విరామంగా అవసరానికి తగిన విధంగా సరఫరా చేయవచ్చు. డయాబెటిస్ వల్ల అనేక కాంప్లికేషన్స్ వస్తాయి. త్వరగా, తీవ్రంగా (అక్యూట్) వచ్చే కాంప్లికేషన్స్ హైపోగ్లైసీమియా, కీటో అసిడోసిస్ లేదా నాన్‌కీటోటిక్ హైపర్‌ఆస్మొలార్ కోమా వ్యాధిని సరిగా నియంత్రించుకోకపోతే రావచ్చు. తీవ్రమైన దీర్ఘకాలిక కాంప్లికేషన్స్‌గా హృద్రోగాలు (రెట్టింపు ఆపద), దీర్ఘకాలిక మూత్రపిండాల బలహీనత, డయాబెటిక్ రెటినోపతి (రెటీనా చెడిపోవడం తద్వారా అంధత్వము కలుగుతుంది), డయాబెటిక్ న్యూరోపతి (చాలా రకాలైన నాడీ కణాలు చెడిపోవడం), సూక్షనాళికలు చెడిపోవడం వల్ల కలిగే పురుషత్వ లోపం, గాయాలు త్వరగా మానకపోవడం ముఖ్యమైనవి. గాయాలు సరిగా మానకపోవడం వల్ల ముఖ్యంగా కాళ్ళలో గాంగ్రీన్ రావడం వల్ల ఒక్కోసారి అవిటితనం కూడా రావచ్చు. డయాబెటిస్‌పై సరైన నియంత్రణ, రక్తపోటును అదుపులో ఉంచుకోవడం, దైనందిన విషయాలలో మార్పులు చేసుకోవడం వల్ల (సిగరెట్లు మానివేయడం లాంటివి), ఆరోగ్యకరమైన బరువును నిలుపుకోవడం చేస్తే పైన చెప్పబడిన చాలా వరకు కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అభివృద్ధి చెందిన దేశాలలో యుక్తవయస్కులలో అంధత్వానికి, మూత్రపిండాలు దెబ్బతిని డయాలిసిస్ అవసరమయ్యే డయాబెటిక్ నెఫ్రోపతికి అతి ప్రధాన కారణం డయాబెటిస్ అని వివరించారు. ఈ కార్యక్రమంలో లయన్ డాక్టర్ ప్రదీప్ సింహ్మ, లయన్ డాక్టర్ సుష్మా దేవి లు షుగర్ పేషంట్లకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
మొక్కలు నాటిన లయన్ జీ ఆర్ సుజాత
హరితహారంలో భాగంగా తూప్రాన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రావి, వేప మొక్కలు నాటి వాటికి నీరు పోశారు.
షుగర్ వ్యాధి పై కరపత్రం విడుదల
ముందుగా షుగర్ వ్యాధి పై అవగాహన కలగడానికి కరపత్రం ను జీ ఆర్ సుజాత గారు విడుదల చేశారు ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ లయన్ జీ. రాధాకృష్ణ గుప్త, జోన్ చైర్మన్ లయన్ ఐరేని రవీందర్ గౌడ్, డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ జానకిరామ్, లియో క్లబ్స్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ లియో గీతారెడ్డి, లయన్ డాక్టర్ ప్రదీప్ సింహ్మ, లయన్ డాక్టర్ శుష్మాదేవి, ప్రెసిడెంట్ లయన్ వంగ భాస్కర్ రెడ్డి, ట్రెజరర్ లయన్ పుట్ట డెకరేషన్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.