శిథిలవస్థకు చేరిన కల్వర్టు ఏదైనా ప్రమాదం జరిగితే గాని పట్టించుకుంటారా?

 

ఇల్లందకుంట ప్రజా బలం ప్రతినిధి నవంబర్ 22

ఇల్లందకుంట మండల పరిధిలోని రాచపల్లి నుండి నాగంపేట మధ్యన ఉండే ప్రధాన రహదారి కల్వర్టు శిథిలావస్థకు చేరింది.దీంతో ఎప్పుడు కులుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.ఏదైనా ప్రమాదం జరుగుతేనే పట్టించుకుంటారా అని ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ కల్వర్ట్ మీదుగా ప్రధానంగా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కు వెళ్లే భారీ వాహనాలు రాకపోకలు ఎక్కువగా సాగిస్తుంటారు.గత సంవత్సరం వర్షాల వరదల తాకిడికి ఈ కల్వర్టు పూర్తిగా కుంగి ద్వసంమైంది. ఈ మార్గం ప్రధానంగా నాగంపేట, రాచపల్లి మీదుగా వంతడుపుల, వావిలాల, బుజునూర్, సీతంపేట ను కలుపుతుంది.స్కూల్ బస్సులు కూడా ఈ మార్గం గుండానే వెళుతూ ఉంటాయి. ఇంత రద్దీగా ఉండే కల్వర్టును ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోవడం పోవడం ఏమిటని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు ఈ కల్వర్టును తొలగించి కొత్తగా కల్వర్టును నిర్మించి అందుబాటులోకి తేవాలని స్థానిక గ్రామాల ప్రజలు ప్రయాణికులు, రైతాంగం కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking