చెస్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులుగా డింగరి శ్రీకాంత్

 

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ ఫిబ్రవరి 6 :

మంచిర్యాల జిల్లా చెస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగ నందమూరి పట్టణానికి చెందిన డింకర్ శ్రీకాంత్ను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర చదరంగం అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఎండి సిరాజ్ ఉర్ రహమాన్ నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా డింగరి శ్రీకాంత్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా ఉపాధ్యక్షులుగా అవకాశం కల్పించిన రాష్ట్ర చదరంగం అసోసియేషన్ ఉపాద్యక్షులు ఎండి సిరాజ్ ఉర్ రహమాన్ కి ఉమ్మడి ఆదిలాబాద్ మంచిర్యాల చదరంగం అసోషియేషన్ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ ఈగ కనకయ్యకి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో చదరంగం క్రీడను అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని చదరంగం క్రీడాకారులను ప్రోత్సహిస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు తన వంతు సహకారం అందిస్తానని ఆయన తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking