ఫెర్టిలైజర్ ఇన్పుట్ డీలర్స్ కి వివిధ పంటల పై నానో ఎరువుల అవగాహన సదస్సు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జనవరి 06 : రైతుల సహకార సంస్థ ఇఫ్కో మంచిర్యాల జిల్లాలో సహకార సంఘాల సిబ్బందికి ఫెర్టిలైజర్ ఇన్పుట్ డీలర్స్ కి వివిధ పంటల పై నానో ఎరువులు యాజమాన్యం గురించి అవగాహన సదస్సును ఇఫ్కో సంస్థ నిర్వహించింది.గురువారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇఫ్కోతెలంగాణ స్టేట్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీ కపా శంకర్,డిస్టిక్ కోపరేటివ్ ఆఫీసర్ బి సంజీవ రెడ్డి,కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ శివ కృష్ణ,మంచిర్యాల్ ఏ డి ఏ అనిత,ఇఫ్కో మంచిర్యాల జిల్లా మేనేజర్ శ్రీధర్ కోరె కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భారతదేశంలో 35,000 కు పైగా ప్రాథమిక సహకార సంఘాలతో భాగస్వామ్యం పొంది ప్రపంచంలోనే అతిపెద్ద సహకార సంస్థగా రూపొందింది,వ్యవసాయంలో అధిక రసాయన ఎరువులు వినియోగించడం వలన నేల సారం తగ్గడమే కాకుండా సమస్యాత్మక నేలలుగా మారుతున్నాయని,దీనికి ప్రత్యామ్నాయంగా ఇఫ్కో సంస్థ నానో యూరియా,నానో డీఏపీ ఎరువులను వాడాలని, రైతులకు సూచించాలని తెలిపారు.నానో టెక్నాలజీ అన్ని రంగాల్లో అభివృద్ధి చిందిందని,మొట్ట మొదటి సారిగా ఇఫ్కో సంస్థ నానో టెక్నాలజీని ఎరువుల తయారీకి ఆపాదించి దని తెలిపారు.నానో ఎరువులు వాతావరణానికి హాని చేయకుండా మొక్కలకు కావలసిన పోషకాలను అందిస్తుంది.రసాయనికి ఎరువులు అధిక వినియోగం వలన నేల,గాలి,నీరు కాలుష్యం అవుతుంది. రసాయనిక యూరియా డిఏపి ఎరువులను తగ్గించి వాటికి బదులుగా నానో యూరియా, నానో డీఏపీ ఎరువులను వాడాలని సూచించారు. మంచిర్యాల జిల్లా డిస్టిక్ కోపరేటివ్ ఆఫీసర్ సంజీవ రెడ్డి మాట్లాడుతూ…సహకార సంఘాలను బలోపేతం చేయడం వలన రైతులకు మేలు కలుగుతుందని తెలిపారు.ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా కూడా నానో యూరియా మరియు నానో డి ఏ పి ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు.మంచిర్యాల ఏ డి ఏ అనిత వివిధ రకాల పంటలలో నేరుగా యూరియా డి ఎ పి ఎరువులను కాకుండా సూక్ష్మ పోషక ఎరువులను కూడా అందిస్తేనే మొక్కలు ఆరోగ్యంగా ఎదిగి మంచి దిగుబడిలను అందిస్తాయని తెలిపారు. కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి శాస్త్రవేత్తలు వివిధ రకాల పంటలలో సేంద్రియ ఎరువుల యాజమాన్యం గురించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతులు,డీలర్స్,యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking