బీసీ కులగణన బూటకపు సర్వే.

మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు చిన్నలింగ్ మల్లికార్జున్ గౌడ్.

తూప్రాన్, ఫిబ్రవరి, 6.ప్రాజబలం ప్రతినిధి.

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన బీసీ కులగణన సర్వే రిపోర్టు పూర్తిగా బూటకపు సర్వేగా అభివర్ణిస్తున్నామని, బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు, తెలంగాణ గౌడ కల్లుగీత వృత్తిదారుల సంఘం మెదక్ జిల్లా అధ్యక్షులు చిన్నలింగ్ మల్లికార్జున్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా చిన్న లింగ్ మల్లికార్జున్ గౌడ్ మాట్లాడుతూ ఈ సర్వేలో గత 2014 సమగ్ర కుటుంబ సర్వే లో 51 శాతం గా ఉన్న బీసీల సంఖ్యను
ప్రస్తుత ప్రభుత్వం విడుదల చేసిన సర్వేలు 46 శాతానికి కుదిరించటం పట్ల దుర్మార్గమైన చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం…
అగ్రకులాల సంఖ్యను రెట్టింపు చేసి బీసీ,ఎస్సీ,ఎస్టీ లా సంఖ్యను గణనీయంగా తగ్గించి చూపడం హేయమైన చర్యగా అభివర్ణిస్తున్నాం..
తెలంగాణలో సమగ్రంగా చేయని సర్వే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సర్వే చేస్తా అంటే నమ్మడం ఎలా అని ప్రశ్నిస్తున్నాం…మొత్తం బీసీల సంఖ్య గత పది సంవత్సరాల నుండి పెరగాలి కాని తగ్గుతుందా…ఈ సంఖ్యని తగ్గించి రిజర్వేషన్లు కుదించి అగ్రకులాల సంఖ్యను ఎక్కువ చూయించి రిజర్వేషన్లు బీసీలకు రాకుండా చేసే కుట్ర దాగుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు…
అసలు హైదరాబాద్ లో సర్వే చేయలేదన్నారు…
ప్రస్తుతం నడుస్తున్నది ప్రజా పాలన కాదని “రెడ్డి పాలనని అగ్రకుల పాలనని మొత్తం రెడ్లతో అసెంబ్లీ,శాసనమండలి నిండిపోయిందని బీసిలకి స్థానం లేదని విమర్శించారు.
ప్రభుత్వం విడుదల చేసిన సర్వే రిపోర్ట్ కాపీలని రాష్ట్రవ్యాప్తంగా తగలబెడతామని తక్షణమే తిరిగి హైదరాబాద్ తో సహా రీ సర్వే చేసి అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking