పాలేరు నియోజకవర్గ సమావేశంలో అఖిల భారత యాదవ మహాసభ నాయకులు
పాలేరు ప్రతినిది ఫిబ్రవరి 06 (ప్రజాబలం) పాలేరు నియోజకవర్గం యాదవులు ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలని సమస్యలను పరిష్కరించుకోవాలని, కావాలని తమ వ్యక్తిగత స్వార్థం కోసం యాదవులను వాడుకోవద్దని, మనమంతా ఐక్యంగా ఉంటేనే రాజకీయాలు మన దగ్గరకు వస్తాయని, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లి బాబు యాదవ్, జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య, జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్, ముఖ్య అతిథులు అఖిల భారత యాదవ మహాసభ సూర్యపేట జిల్లా అధ్యక్షులు మర్యాద సైదులుయాదవ్ టీపీసీసీ మెంబర్లు నాగ సీతారాములు, యాదవ్ పుచ్చకాయల వీరభద్రం యాదవ్ డా వాకదాని పుల్లారావు లింగమంతుల పెద్దగట్టు జాతర అధ్యక్షులు పోలేపల్లి నరసయ్య పేర్కొన్నారు అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో కూసుమంచిలో పాలేరు నియోజకవర్గస్థాయి సమావేశం జరిగింది. వందలాదిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ వందేళ్ళ చరిత్ర కలిగిన అఖిల భారత యాదవ మహాసభ నీడన ఉత్తర భారత దేశంలో యాదవులు ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా, ఎంపీలుగా పనిచేశారని, ప్రస్తుతం దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారని, యాదవ మహాసభ చేపట్టిన కార్యక్రమం ద్వారానే 1992 -93 లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో గొర్రెల సంఘాలు ఏర్పడ్డాయని, 2006లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఫెడరేషన్ ఏర్పాటయిందని, గత ప్రభుత్వం గొర్రెలకు డీడీలు కట్టించుకుని గొర్రెలు ఇవ్వకుండా మోసం చేసిందని, అవినీతి అధికారులను అడ్డుపెట్టుకొని ప్రభుత్వమే మోసం చేయించిందని ఆరోపించారు. అప్పుడు అడగలేని కొందరు పెద్దలు తమ వ్యక్తిగత స్వలాభం కోసం యాదవులను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని, అవి మానుకోవాల్సిందిగా హితవు పలికారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎక్కడ యాదవులు పోటీ చేసినా, ఐక్యంగా ఇతర బీసీ వర్గాలను కలుపుకొని గెలిపించు కోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. గొర్రెల పెంపకం దారుల యాదవుల సమస్యలపై అనేకసార్లు మంత్రులకు విన్నవించడం జరిగిందని, భవిష్యత్తులో భారీ కార్యక్రమం చేపట్టి మన డిమాండ్లను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా వక్తలు పిలుపు నిచ్చారు ఎన్సీడీసీ స్కీమును పునరుద్ధరించాల ని ఎన్ఎల్ఎం స్కీం లో బ్యాంకు గ్యారంటీ లేకుండా గొర్రెల పెంపకం దారులకు రుణాలు మంజూరు చేయాలని, మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా కాంగ్రెస్ పార్టీ యాదవులకు నిధులు మంజూరు చేయాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో సమచితమైన ప్రాధాన్యత నివ్వాలని, ప్రమాదవశాత్తు మరణించిన గొర్రెల కాపరికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం అఖిల భారత యాదవ మహాసభ కూసుమంచి మండల అధ్యక్షులు కార్యదర్శులు గా భారీ నాగేశ్వరరావు, కాకర్ల రాము నేలకొండపల్లి మండలం మల్లెబోయిన శ్రీనివాస్ మన్నె కృష్ణ ఖమ్మం రూరల్ మండలం నడికొప్పుల గోపరాజును నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొదిలి సతీష, డిసిసిబి డైరెక్టర్ నూకల సైదులు యాదవ్, జిల్లా మహిళా కార్యదర్శి కనక బండి విజయలక్ష్మి గొర్రెల సంఘం అధ్యక్షులు సోమనబోయిన లింగయ్య యాదవ్ మొరిమేకల కోటయ్య, చేతుల నాగేశ్వరరావు భారీ సురేష్. పుట్ట ఉపేందర్. సత్తి వెంకన్న.చంద్రకాని రమణ,లిక్కి కృష్ణారావు యాదవ్, మారుతి ఎట్టయ్యశీలం రవి, చెన్ను వెంకటరమణ జక్కుల యాదగిరి వేల్పుల సుశీల దాసరి వెంకన్న మన్నె కృష్ణయ్య, మరియు తదితరులు పాల్గొన్నారు