సమయపాలనా పాటిస్తూ క్రమశిక్షణ,నీతి నిజాయితితో విధులు నిర్వర్తించాలి

 

ఇతర శాఖల విధులతో పోలిస్తే పోలీసు డ్యూటీ సవాళ్లతో కూడినది

పోలీస్ కమీషనర్ ఐపిఎస్ ఐజీ ఎం.శ్రీనివాస్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 10 : నూతన సాయుధ దళ (ఎఆర్) కానిస్టేబుళ్ళకు పోలీస్ కమీషనర్ దిశా నిర్దేశం ఉన్నత చదువులు చదివి పోలీస్ ఉద్యోగ ప్రయత్నంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని పోలీసు శాఖలో పూర్తి బాధ్యతలు నిర్వహించేందుకు ఎంపిక చేయబడిన ప్రతి ఒక్కరు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నీతి నిజాయితీతో విధులు నిర్వహించాలని కష్టపడి సాధించిన ఉద్యోగానికి సార్థకత తీసుకురావాలని రామగుండము పోలీస్ కమీషనర్ ఐపిఎస్ ఐజీ ఎం.శ్రీనివాస్ పేర్కొన్నారు.ఈ రోజు నూతన సాయుధ దళ (ఎఆర్) కానిస్టేబుళ్ళతో కమీషనరేట్ కార్యాలయంలోని సమావేశ హల్ లో ఎఆర్ పోలీసు విధులు గురించి మరియు క్రమశిక్షణ తదితర అంశాల గురించి పోలీస్ కమీషనర్ దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్బంగా సిపి గారు మాట్లాడుతూ…మీరు ఎంచుకొన్న, చేస్తున్న ఉద్యోగం లో విధులు గర్వంగా నిర్వర్తించండి. ఈ ఉద్యోగాల్లో ఉన్నంత సమయం క్రమశిక్షణతో సమయపాలన పాటిస్తూ, మంచి టర్న్ అవుట్ తో అప్పగించిన విధులు గర్వంగా నిబద్దతతో నిర్వహించమన్నారు. పోలీస్ జీవితంలో క్రమశిక్షణ ఎంతో ముఖ్యమైనదని సమయపాలన పాటిస్తూ అధికారుల సలహాలు సూచనలు పాటిస్తూ తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహిస్తూ అధికారుల మన్ననలు పొందాలని శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని కోరారు.అర్ముడ్ ఫోర్సు సిబ్బంది అన్ని రకాల విధులు నిర్వహించడం జరుగుతుంది ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినప్పుడు సమయనుకులంగా ఎలా ప్రవర్తించాలి,గార్డ్ డ్యూటీ విధులు,విఐపి లకు పిఎస్ఓలుగా విధులు, బిడిటీమ్స్,బాంబు స్క్వాడ్ విధులు,ఎస్కార్ట్ డ్యూటీ లు,స్పెషల్ పార్టీ విధులు, ఇతర ముఖ్యమైన బందోబస్తు డ్యూటీ లు చేసేటప్పుడు ఎలా ప్రవర్తించాలి,ప్రజలతో మర్యాదగా మాట్లాడాలి ప్రవర్తించాలి అనే అంశాలు వివరించారు.మెన్,ఉమెన్ అని తేడా లేకుండా విధులు నిర్వహించాలని పోలీస్ శాఖలో ఉద్యోగం అంటేనే అనేక సవాళ్లతో కూడుకున్న ఉద్యోగమని మానసికంగా,శారీరకంగా దృఢంగా ఉండాలని సూచించారు.అధికారులు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు.ఉన్నతాధికారుల నుండి సంపూర్ణ సహాయ సహకారాలు అందుతాయని, క్రమశిక్షణతో పని చేయాలని సూచించారు. విధులు పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తిన వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.నీతి,నిజాయితీతో పనిచేసే వారికి పోలీస్ శాఖలో ఎల్లప్పుడూ ప్రత్యేక గుర్తింపు ఉంటుందని అన్నారు.ప్రతీ ఒక్కరూ క్రమశిక్షణ,నీతి నిజాయితి నిబద్దత ఎలాంటి ప్రలోబాలకు గురికాకుండా పనిచేసి పోలీస్ వ్యవస్థకు, కమీషనరేట్ కు,తెలంగాణ పోలీస్ కు,రాష్ట్రానికి మంచి పేరు తేవాలని కోరారు.ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు,ఏ ఆర్ ఏసిపి లు ప్రతాప్,సుందర్ రావు, ఆర్ఐ లు దామోదర్, వామనమూర్తి, శ్రీనివాస్, మల్లేశం,సంపత్ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking