విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వ వివక్షత తగదు.

 

-రాష్ట్ర సదస్సు ని విజయవంతం చేయండి.

-తెలంగాణ జన సమితి మహిళా విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికిల్ల స్రవంతి.

జమ్మికుంట (ప్రజాబలం)
జనవరి 17

తెలంగాణ జన సమితి పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర విభజన హామీల అమలు, కేంద్ర ప్రభుత్వ వివక్షత పై ఈ నెల 21 న తలపెట్టిన రాష్ట్ర సదస్సు పోస్టర్ ని జమ్మికుంట పట్టణంలో ఆ పార్టీ మహిళా విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికిల్ల స్రవంతి ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. ఈ సందర్బంగా స్రవంతి మాట్లాడుతూ వేలాదిమంది బలిదానాల సాక్షిగా సీమాంధ్ర పెట్టుబడిదారీ దోపిడీ కబంధహస్తాల నుండి తెలంగాణను భౌగోళికంగా విముక్తి చేసుకున్నాం. సాధించుకున్న రాష్ట్రంలో ఏర్పడిన తొలి తెలంగాణ ప్రభుత్వం దాని అధినేత కేసిఆర్ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను పట్టించుకోకుండా నీళ్లు, నిధులు, నియామకాలు అనే తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ను మరిచి కాంట్రాక్టులు, కమిషన్లు, ఓట్లు, సీట్లు, తన కుటుంబ ఆధిపత్యం లక్ష్యంగా పాలన కొనసాగించాడని,అన్ని ప్రజాస్వామ్య రాజ్యాంగ బద్ధ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ తాను నిర్మించుకున్న ఘడీ సాక్షిగా పాలన కొనసాగించాడు.ప్రశ్నించే వారిని అణచివేశాడు.
తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఉద్యమ రథసారధి ప్రొఫెసర్ కోదండరాం ఇంటి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేసి తన ఖర్కశత్వాన్ని చాటుకున్నాడు.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కెసిఆర్ దొర పాలనను తెలంగాణ ప్రజలు అంతం చేశారని ఆమె తెలిపారు.రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటా ప్రకారం కృష్ణ జలాల్లో తెలంగాణ న్యాయమైన వాటా,
ఉద్యోగుల విభజనను పూర్తిచేసి తెలంగాణ ఉద్యోగులను వెనక్కి పంపాలి,పెండింగ్లో ఉన్న రాష్ట్రస్థాయి సంస్థలను,ఆస్తులను విభజించాలి.
రాష్ట్రంలో హార్టికల్చర్ యూనివర్శిటీనీ వెంటనే ఏర్పాటు చేయాలి.బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీనీ, ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తక్షణమే ఏర్పాటు చేయాలనే డిమాండ్ల తో నిర్వహించే సభ నియోజకవర్గంలోని కార్యకర్తలు,మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని సభ ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో యువజన సమితి జిల్లా నాయకులు పల్లెర్ల శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking