న్యూ డిల్లీ ఏప్రిల్ 1 () కేంద్ర ప్రభుత్వం బీసీల సంక్షేమానికి రెండు లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించి ఆర్ధిక , విద్య, ఉద్యోగ, శిక్షణ, అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రాందాస్ అద్వాలే ను నేడు ఢిల్లీలో కలిసి చర్చలు జరిపారు.
రాందాస్ అద్వాలే హామీ
బిజెపి ప్రభుత్వం కులాల వారిని లెక్కలు తీయడానికి సుముఖంగా ఉందని, సంబంధిత అధికారులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రధానమంత్రితో నరేంద్ర మోడీతో – ఇతర కేంద్ర మంత్రులతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ చర్చలలో బీసీ సంక్షేమ సంఘ జాతీయ కన్వీనర్ గుజ్జు కృష్ణ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇంచార్జ్ కర్రి వేణుమాధవ్, భూపేష్ సాగర్, వర ప్రసాద్, కె. రాము, బాషయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.