నాగోల్ ఏప్రిల్ 1 ();హైల్ టాటా మణి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కె.జ్యోతి ఆధ్వర్యంలో నాగోల్ ప్రాంతంలో శనివారం రహదారి పైన గల కూలీలకు ప్యాంటు షర్టులను బహుకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో అనేక వేలమంది ఆకలిని తీర్చామని, నిత్యావసర సరుకులు అందజేస్తూ, పేదల అత్యవసరాలను తీర్చేందుకు తమ సంస్థ కృషి చేస్తుందని పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా నిస్వార్ధంగా పేదలకు సేవ చేస్తున్న, తమ సంస్థకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పేదల అవసరాలు తీర్చడంలో ఉన్న సంతృప్తి మరెందులోనూ లేదని ఈ సందర్భంగా ఆమె తన సంస్థ కార్యకలాపాలను గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో రమణ యాదవ్ తో పాటు తమ సంస్థ కార్యకర్తలు పి. ఉషారాణి కే. ప్రవీణ్ కుమార్, ప్రేమలత జగదాంబ జి. రాజు పాల్గొన్నారని హైల్ టాటా మణి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కె.జ్యోతి వివరించారు.