రాహుల్ గాంధీపై అనర్హత వేటువేయడం అప్రజాస్వామికం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

 

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మ‌ల్, మార్చి 25: రాహుల్ గాంధీపై పార్లమెంట్ అనర్హత వేటువేయడాన్ని అటవీ పర్యావరణ,న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది అప్రజాస్వామికమని ఇలాంటి చర్యలు ప్ర‌జాస్వామ్యాన్ని బ‌ల‌హీన‌ప‌రుస్తుంద‌ని ఆన్నారు.కోర్టు తీర్పు ఇచ్చిన 24 గంట‌ల లోపే ఈ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌డం దారుణ‌మ‌న్నారు. నిర్మల్ నియోజకవర్గం సోన్ మండ‌ల కేంద్రంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రశ్నించే గొంతు నొక్కేందుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందని వెల్లడించారు.ఇవాళ రాహుల్ గాంధీ రేపు మరొకరిని ఇలానే చేస్తుందని,ఇలాంటి అమానుష చర్యలను పార్టీలకు అతీతంగా మనమందరం దీన్ని ఖండించాలని ఆన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking