రాహుల్ గాంధీ విధించిన జైలు శిక్ష కి లక్షెట్టిపేట నాయకులు నిరసనగా

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 25 : సూరత్ కోర్ట్ రాహుల్ గాంధీకి విధించిన జైలు శిక్ష కి నిరసనగా డిసిసి అధ్యక్షుడు ఏఐసీసీ మెంబర్ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.శనివారం ఈ సందర్భంగా లక్షెట్టిపేట మున్సిపాలిటీ అధ్యక్షుడు ఎండీ అరీఫ్ మాట్లాడుతూ…కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం లో భాగంగా ఇవాళ రాహుల్ గాంధీ కి జైలు శిక్ష విధించడం జరిగింది అని, ప్రతిపక్ష పార్టీ ల పైన ఈడీ,సిబిఐ రైడ్ లు చేపించడం ద్వారా దేశంలో ఎమర్జెన్సీ పాలన సాగుతుంది అని విమర్శించారు…ఈ కార్యక్రమంలో మున్సిపాలి ఫ్లోర్ లీడర్ చెళ్ళ నాగభూషణం,డిసిసి ఉపాధ్యక్షుడు చింత అశోక్ ఎంపీపీ అన్నం చిన్నన్న- మంగ,వైసి ఎంపీపీ దేవేందర్ రెడ్డి,లక్షెట్టిపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమెల రాజు,ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ గుత్తికొండ శ్రీధర్,సీనియర్ నాయకులు టేకుమట్ల సత్తయ్య,ములా కిషన్,గుత్తికొండ శ్రీధర్,హాజీ,కొలా నాగార్జున,రాజేష్, సూరంచంద్రమౌళి,యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొప్పు సుమన్,ఎస్సీ సెల్ అధ్యక్షులు చాతరాజ్ రాజేష్, మైనార్టీ అధ్యక్షులు నవాబ్ ఖాన్,ముఖరాంజా,తోట రాజయ్య, సందీప్,చెందు,చిన్నయ్య,చెంద్ర శేకర్,చిన్న వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking