ఆల్బెండజోల్ టాబ్లెట్స్ పంపిణీ

– జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా..

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జూన్ 20

జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం కాకతీయ ఈ టెక్నో స్కూల్ విద్యార్థి విద్యార్థులకు అల్బెండజొల్ టాబ్లెట్ లను జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్నకోటి పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఒక సంవత్సరం నుండి 19 సంవత్సరాల వరకు అందరూ నులిపురుగుల నివారణ మాత్రలు వేసుకోవాలని చెప్పారు. విద్యార్థులందరూ ఆరోగ్యంగా ఉండాలని, చురుకుగా చదువుకోవాలని, మంచి విటమిన్స్ ఉన్న ఫ్రూట్స్ తినాలని సూచించారు. వారు ఉండే పరిసర ప్రాంతాలలో పరిశుభ్రంగా ఉండాలని, స్కూల్లో కూడా స్కూల్ యజమాన్యం పరిశుభ్రంగా చూసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ చందన మెడికల్ ఆఫీసర్ ఆర్ శంకర్ రెడ్డి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రత్నకుమారి , సూపర్ వైజర్ డి రజిత , ఏఎన్ఎం, ఆశ వర్కర్స్, కాకతీయ ఈ టెక్నో స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు , హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking