రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 04 అక్టోబర్ 2023: ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇష్టానుసారం రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే టీ. ప్రకాష్ గౌడ్ బతుకమ్మ చీరల పంపిణీ శంషాబాద్ మండలంలోని నర్కుడ గ్రామంలో ప్రారంభించి మహిళలకు అందజేశారు, తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన గ్రామీణ క్రీడా ప్రాంగణానాలకు కేసీఆర్ స్పోర్ట్స్ కిట్లను యువతకు ఎమ్మెల్యే అందజేశి మాట్లాడుతూ దసరా పండగకు పుట్టింటి సారె పెద్దన్నగా ఉన్న సీఎం కేసీఅర్ పంపిణీ చేస్తున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు.