ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 21 : మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జన్మదిన సందర్భంగా ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. కీ,,శే,,కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో
శనివారం నస్పూర్ మున్సిపాలిటీలోని 3,4,5,6,7,9,16,17 వార్డులకు బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అనంతరం కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే సాగర్ రావు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, నాయకురాలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.