ప్రజాబలం ప్రతినిధి తార్నాక సెప్టెంబర్ 21:స్థానిక నోమ ఫంక్షన్ హాల్ నందు నారాయణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు భవిష్యత్తులో ఏం చదవాలి, ఎక్కడ చదవాలి, ఎంత చదవాలి, ఎలా చదవాలి? అన్న విషయాలతో పాటు భారతదేశంలో గల ఉన్నత కళాశాల వివరాలు మరియు ఆ కళాశాలలో ఏ ర్యాంకు వస్తే సీట్ దొరుకుతుంది అన్న వివరాలు పూర్తిగా వివరించి చెప్పడం జరిగింది.
ప్రతి తల్లిదండ్రులకి తమ పిల్లల భవితకు ఎంత ఆలోచన చేస్తారో అంత కార్యరూపానికి ఈ కార్యక్రమం సహాయపడేలా అన్నింటిని వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముందుగా విశిష్ట అతిథిగా విచ్చేసిన పవన్ కుమార్ శర్మ ఐఐటి,నీట్ ల గురించి పూర్తి వివరాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నారాయణ పాఠశాల ఏజీఎం బాల పరమేశ్వర్ మరియు కళాశాలల ఏజీఎం శ్రీనివాస్ రెడ్డి, దీపక్ పాల్గొన్నారు.తార్నాక పాఠశాల ప్రిన్సిపాల్ పర్వీన్ మరియు ఉపాధ్యాయ బృందము పాల్గొన్నారు చాలా ఉపయోగకరమైన కార్యక్రమం అని చెప్పారు.
