ట్రాఫిక్‌ పోలీసులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ: ట్రాఫిక్ ఏసీపీ

 

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 13 (ప్రజాబలం) ఖమ్మం నగరంలో కొద్దిరోజులుగా ఎండ తీవ్రత అధిక మవుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ విధుల్లో ఉన్న పోలీసులకు ఉపశమనం కల్పించేందుకు విఎన్ఆర్ డైరీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం వేళల్లో మజ్జిగ అందించే కార్యక్రమాన్ని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు చేతుల మీదుగా ప్రారంభించారు. రోజుకి 100 మజ్జిగ ప్యాకెట్లు చొప్పున నెల రోజులు పాటు ట్రాఫిక్ సిబ్బందికి అందజేసేందుకు సమాజిక దృక్పథంతో ముందుకు వచ్చిన విఎన్ఆర్ డైరీ చెందిన బి.లింగరాజు కమలకర్ నరసింహారావు లను ఏసీపీ అభినందించారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ మోహన్ బాబు ఎస్సై రవి సాగర్ పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking