హైదరాబాద్ రామకృష్ణ మఠం వారిచే మరో 500 మంది వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ

ఖమ్మం ప్రతినిది సెప్టెంబర్ 24 (ప్రజాబలం) మున్నేరు వరద బాధితులకు ఖమ్మం వివేకానంద ఇన్ స్టాఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో శ్రీ రామకృష్ణ విద్యాలయం నందు నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ రామకృష్ణ మఠం బాధ్యులు శ్రీ పూజనా నంద స్వామీజీ పాల్గొని వితరణ కిట్లు అందజేశారు. మున్నేరు పరివాహ ప్రాంతాల లో క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తి స్థాయిలో నష్టం జరిగిన మరో 500 మంది( మొత్తం వెయ్యి కుటుంబాలకు) 25 కేజీల బియ్యం కందిపప్పు నూనె ,సబ్బులు ,సర్ఫ్, కారం, పసుపు , గిన్నెలు ప్లేట్లు, బకెట్ అండ్ మగ్గు కూడిన కిట్టును ఇవ్వడం జరిగింది. స్వామీజీ మాట్లాడుతూ ఖమ్మంలో జరిగినటువంటి ఈ విపత్తు చాలా బాధాకరమని చాలామంది నిరాశ్రయులయ్యారని వారి సహాయార్థం నిత్యావసర వస్తువులు సంబంధించిన కిట్టు ఇచ్చి తమ వంతు సహకారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ డైరెక్టర్ శ్రీ వాసుదేవరావు గారు మాట్లాడుతూ ఖమ్మం ఇటువంటి సేవా కార్యక్రమానికి సహకరించిన రామకృష్ణ మఠానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు .సంస్థ చేస్తున్నటువంటి వివిధ శిక్షణ కార్యక్రమాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ బాధ్యులు చంద్రశేఖర్ జయంతి పటేల్, రాముడు, అశోక్, రాధాకృష్ణ, రాగిణి,స్నేహ, కళ్యాణి, లలిత , మండే నరసింహారావు, చారి దుర్గాప్రసాద్ ,నున్న రవి, భద్రం, వీరభద్రం మరియు వాలంటీర్స్ పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking