బీసీల రాజ్యాధికారమే కాంగ్రెస్ ధ్యేయం.

పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి ఘనంగా శాలువతో సత్కరించిన గడప దేవేందర్.

మెదక్ జిల్లా సెప్టెంబర్ 24 ప్రజాబలం న్యూస్ :-

మెదక్ జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ గడప దేవేందర్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి,శాలువాతో సత్కరించి శుభాభివందనాలు తెలిపిన మత్స్యశాఖ డైరెక్టర్ గడప దేవేందర్ అనంతరం వారు మాట్లాడుతూ బీసీలకు కావాల్సింది పదవులు కాదని, రాజ్యాధికారమని స్వాతంత్య్రం వచ్చిన 76 ఏండ్లలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా బీసీలను పట్టించుకోలేదన్నారు.
ప్రతి గ్రామంలో వంద మంది బీసీలు విద్యావంతులుగా ఉన్నారని, వారికి పదవులు ఇవ్వాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వచ్చే స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా బీసీలందరూ ఐక్యంగా ఉండి పోరాడాలని,బీసీలు ఐక్యంగా ఉంటే రాజ్యాధికారమే మన దగ్గర వస్తాయని కొనియాడారు. కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking