ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ నవంబర్ 22 :
మందమర్రి పట్టణంలోని మా ఊరు మా సేవా సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఊరు మందమర్రి కి చెందిన 10 కుటుంబాలకు ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు బండి సదానందం చేతుల మీదుగా అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవే అని, ప్రార్థించే పెదవుల కన్న సహాయం చేసే చేతులు మిన్న అనే సిద్ధాంతాన్ని నమ్మిన మా ఊరు సేవా సంఘం ఆధ్వర్యంలో ఎండి ఇబ్రహీం చేసే సేవలు అభినందనీయమన్నారు. మా ఊరు సేవా సంఘం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని సంఘం సేవలను కొనియాడారు. ఈకార్యక్రమంలో మా ఊరు సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఎండి ఇబ్రహీం, అధ్యక్షులు పెద్ది రాజన్న, డాక్టర్ శంకర్, కోట రాజన్న, పాలమాకుల బీమ్ సేన్, ఎం.డీ ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు.