ప్రకృతిని ఆరాధించడమే వనభోజనాల ఉద్దేశం

యాదవ బంధుమిత్రుల వనభోజనాల కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ నాయకులు

ఖమ్మం ప్రతినిధి నవంబర్ 22 (ప్రజాబలం) ఖమ్మం ఈనెల 24వ తారీఖు ఆదివారం, యాదవ కురుమ బంధుమిత్రుల వన సమారాధన కార్యక్రమం చెరుకూరి మామిడి తోట ఖమ్మంలో జరుగుతుందని ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య కురుమ మరియు జాతీయ రాష్ట్ర జిల్లా స్థాయి అఖిలభారత యాదవ్ మహాసభ నాయకులు పాల్గొంటారని, కావున ఈ కార్యక్రమం లో ప్రతి కురుమ యాదవ కుటుంబం పాల్గొని జయప్రదం చేయవలసిందిగా అఖిలభారత జిల్లా యాదవ మహాసభ గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ పిలుపునిచ్చారు శుక్రవారం నాడు ముదిగొండ మండలంలో, తిరుమలాయపాలెం మండలంలో ప్రచార జాత నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ పట్టణాలలో గ్రామాలలో నివసించే ప్రతి వ్యక్తి ఆధునిక నాగరికతకు అలవాటు పడి ప్రకృతిని ఆస్వాదించడం కరువైంది. అలాంటి ప్రకృతిని ఆరాధించడమే ఈ వనభోజనాల ప్రధాన ఉద్దేశమని, తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరూ సహపంక్తి భోజనాలు చేసి, ఒకరి క్షేమ సమాచారాలు మరొకరు అడిగి తెలుసుకుని బంధుత్వాన్ని పెంచుకొనడం జరుగుతుందని, గతంలో వనభోజనాల సందర్భంగా జరిపే యజ్ఞ యాగాదులు హోమాల వల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు పచ్చగా ఉండేవని, ఆ సాంప్రదాయాన్ని మన యాదవు లే ప్రారంభించడం అదృష్టమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పొదిల సతీషు వాక దాని కోటేశ్వరరావు, తెల్లబోయిన రమణ, తోడేటి లింగరాజు కాసు మల్లేష్,దుప్పటి రవి కురుమ,వాకధాని కన్నయ్య,కొట్టే శ్రీనివాసరావు పోతురాజు పురుషోత్తం, బట్టు బసవయ్య చిలకల రామకృష్ణ ధనియాకుల సాయి, మేగడ శ్రీనివాసరావు తండ్రి పేరు కోటయ్య మీగడ నాగరాజు వట్టి నాగేశ్వరరావు,రాగం కోటేశ్వరరావు, కనక బండి శ్రీనివాసరావు, పుచ్చకాయల రామకృష్ణ పుచ్చకాయల అప్పారావు మరియు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking