హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్ 22 : మంచిర్యాలలో క్యాన్సర్ చికిత్స ఆసుపత్రి మంజూరు అయినట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. శుక్రవారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడారు. ఉత్తర తెలంగాణ లో మంజూరు అయిన నాలుగు ఆసుపత్రులలో ఒకటి మంచిర్యాల లో ఏర్పాటు కు పచ్చ జెండా ఊపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.మంత్రులు శ్రీధర్ బాబు,దామోదర రాజనర్సింహ లకు కృతఙ్ఞతలు తెలిపారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేయబోతున్నట్లు చెప్పారు.ముల్కళ్ల నుంచి బసంత్ నగర్ అనుసంధానం గా గోదావరి నది పై బ్రిడ్జి నిర్మాణం ప్రక్రియ ఆరంభమైందన్నారు.బ్రిడ్జి నిర్మాణం జరిగితే దూరభారం తగ్గుతుందని తెలిపారు.డిసెంబరు లో వేంపల్లి పరిశ్రమల నిలయంగా మారుస్తున్న తరుణంలో బసంత్ నగర్ లో ఎయిర్ పోర్ట్ మంజూరు కావడం పరిశ్రమల ఏర్పాటుకు దోహదం చేస్తుందని తెలిపారు. మంచిర్యాల లో రెండవ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.ట్రామా ఆసుపత్రి వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ప్రాంగణంకు, క్యాన్సర్,ఆయుష్ ఆసుపత్రులు ఐటీ ఐ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.81 కోట్లు కోర్టు భవనాలు నిర్మాణంకు మంజూరు అయినట్లు తెలిపారు.అలాగే కాగజ్ నగర్ కు వెళ్లాల్సిన ఈఎస్ ఐ ఆసుపత్రి మంచిర్యాల కు మంజూరైందని కలెక్టర్ కార్యాలయం పక్కన స్థలం కేటాయించిన ట్లు వివరించారు. రాళ్ళవాగు పై వంతెన నిర్మాణం,వంద ఫీట్ల రోడ్ కు ఉన్న ఆటంకాలను తొలగిస్తామని చెప్పారు.మంచిర్యాలలో నిరుపేద లకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. మంచిర్యాలలో 12 ఎకరాల్లో ఇండోర్,అవుట్ డోర్ స్టేడియం నిర్మాణం ప్రారంభమవుతుందని తెలిపారు. మంచిర్యాలలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లు నిలిపేల కృషి చేస్తానని చెప్పారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక్ తిరుపతి,మంచిర్యాల డిసిసి జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు,రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ శాఖ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు తుమ్మల నరేష్,నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సురిమిళ్ళ వేణు నస్పూర్ మున్సిపల్ ఛైర్మన్,మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యావుల పద్మ ముని,లక్షెటిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేమ్ చంద్,నస్పుర్ మున్సిపల్ వైస్ చైర్మన్ రజిత, మంచిర్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బదరి సుధాకర్, లక్షెటిపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండీ ఆరిఫ్, మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు
పూదరి తిరుపతి, లక్షెటిపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమెల రాజు, దండేపల్లి మండల అధ్యక్షుడు
అక్కల వెంకటేశ్వర్లు, లక్షెటిపేట మండల అధ్యక్షుడు పింగిళి రమేష్,హాజిపూర్ మండల అధ్యక్షుడు తోట రవి కౌన్సిలర్లు ఎంపీటీసీలు, సర్పంచులు,వార్డ్ నెంబర్స్,కాంగ్రెస్ కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నారు.