మహారాష్ట్ర ఎన్నికలలో వార్ ఒన్ సైడే !! ప్రముఖ రాజకీయ జ్యోతిష పండితులు ఆచార్య రాఘవేంద్ర

215 సీట్లకి పైగా సాధిస్తూ చరిత్ర సృష్టించబోతున్న మహాయుతి కూటమి !!
క్లీన్ స్వీప్ దిశగా మహాయుతి కూటమి
60లోపు సీట్లకి పరిమితమవుతు ఘోర పరాజయం దిశగా మహావికాస్ అఘాడి కూటమి
బలమైన సింగిల్ పార్టీ దిశగా అడుగులు వేయబోతున్న బిజెపి
అత్యంత దారుణమైన ఫలితాలను చవిచూడనున్న కాంగ్రెస్
ఈ ఎన్నికల ఫలితాలతో తలరాతలు మారనున్న రెండు పార్టీల భవితవ్యం
అత్యంత శక్తివంతమైన నేతగా మారనున్న ఏక్ నాథ్ షిండే
ఉనికి కోల్పోయి బొక్క బోర్లా పడనున్న ఉద్ధవ్ థాక్రే వర్గం

దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు నవంబర్ 23తేదీన వెలువడనున్న నేపధ్యం లో ప్రముఖ రాజకీయ జ్యోతిష పండితులు ఆచార్య రాఘవేంద్ర పలు సంచలనమైన జ్యోతిష ఫలితాలను తెలియజేశారు.
మహారాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం లో పలు దశాబ్దాల నుండి ఏ పార్టీకి కూడా రానంత అత్యధికమైన మెజారిటీ సీట్లు 133 నుండి 138వరకు బిజెపి పార్టీ ఈ ఎన్నికలలో పొందబోతుందని,ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేనపార్టీ రెండవ బలమైన పార్టీగా మారుతూ సుమారు 60 నుండి 65 స్థానాలలో విజయం సాధించబోతుందని,ఈ ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేనపార్టీకి వచ్చినన్ని సీట్లు కనీసం మహావికాస్ అఘాడి కూటమి మొత్తానికి కూడా వచ్చే అవకాశాలు దాదాపు అసాధ్యం అని ఆచార్య రాఘవేంద్ర జ్యోష్యం చెప్పారు.
ఇక అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్‌సి‌పి పార్టీ 22 నుండి 26 సీట్లు సాధించే అవకాశం ఉండగా,మహావికాస్ అఘాడి కూటమి లో ఉన్న ప్రముఖ పార్టీ కాంగ్రెస్ పార్టీకి కూటమిలోనే అత్యల్పంగా 8 నుండి 12 సీట్లు వచ్చే అవకాశం ఉండగా,ఈ కూటమిలో అత్యధికంగా శరద్ పవార్ వర్గానికి చెందిన ఎన్‌సి‌పి పార్టీ కి 31 నుండి 35 వరకు సీట్లు రానున్నాయని,ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన శివసేనపార్టీకి 10 నుండి 13 సీట్లు రానున్నాయని జ్యోతిష పండితులు ఆచార్య రాఘవేంద్ర చెప్పారు.అలాగే ఎస్‌పి పార్టీ 0-1, సిపియం 0 నుండి 1, ఎంఐఎం పార్టీ 1 నుండి 3 సీట్లు సాధించబోతుండగా,మొత్తంగా చూస్తే ఈ ఎన్నికలలో మహాయుతి కూటమి మహారాష్ట్ర రాజకీయాలలోనే ఒక నూతన అధ్యాయానికి తెరతీస్తూ అత్యధికంగా 215 నుండి 231 సీట్లు సాధించడం ద్వారా చరిత్ర సృష్టించబోతుండగా, మహావికాస్ అఘాడి కూటమి కి 49 నుండి 60 వరకు సీట్లు రానున్నాయని,అలాగే ఈ ఎన్నికల ఫలితాల అనంతరం ఒకానొక సమయంలో మహారాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పిన శివసేన,ఎన్సీపీ లకు చెందిన ఉద్ధవ్ థాక్రే ,శరద్ పవార్ రాజకీయ జీవితం చెప్పుకోదగిన స్థాయిలో తీవ్రమైన కుదుపులకు లోను కాబోతుందని ఆచార్య రాఘవేంద్ర జోష్యం చెప్పారు.గతంలో జ్యోతిష పండితులు ఆచార్య రాఘవేంద్ర ఆంధ్ర అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు,తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల గురించి మాత్రమే కాకుండా అంర్జాతీయంగా బ్రిటన్,ఫ్రాన్స్,అమెరికాలలో జరిగిన ఎన్నికల ఫలితాల గురించి చెప్పిన జ్యోష్యం నూటికి నూరుపాళ్లు అక్షర సత్యం గా మారడం మన పాఠకులకు తెలిసిన విషయమే.
పలుమార్లు ప్రముఖ రాజకీయ జ్యోతిష పండితులు ఆచార్య రాఘవేంద్ర ఆయా ఎన్నికల ఫలితాల గురించి చెప్పిన జోష్యం నిజమైన సందర్బంగా ఈ సారి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల పై వారి జోష్యం ఎలా ఫలించబోతుందా అని పలువురు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking